Malayalam Movie OTT: తెలుగులోకి సూపర్ హిట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్-manjummel boys ott streaming of telugu version on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movie Ott: తెలుగులోకి సూపర్ హిట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్

Malayalam Movie OTT: తెలుగులోకి సూపర్ హిట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu

Manjummel Boys OTT Telugu Version: మలయాళ చిత్ర పరిశ్రమలో రూ. 200 కోట్లు కొల్లగొట్టిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో తీసుకురానున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తెలుగు థియేట్రికల్ రిలీజ్‌కు ముందే తెలుగు వెర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

తెలుగులో వస్తున్న మలయాళ సర్వైవల్ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్

Manjummel Boys OTT Streaming Telugu: మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పటికీ ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఇటీవలే ప్రేమలు సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రానుంది. అదే మంజుమ్మల్ బాయ్స్, 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు. కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే మంజుమ్మల్ బాయ్స్.

వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ విడుదల కానుంది. అయితే, తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఈ సినిమా మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 5 నుంచి మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు వినిపించాయి. కానీ, తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్‌తో ఓటీటీ విడుదల ఇంకాస్తా ఆలస్యం కానుందని ఇటీవలే క్లారిటీ వచ్చింది.

అయితే, ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేయనుందని మరో టాక్ వినిపిస్తోంది. తెలుగులో విడుదలైన వారం, పది రోజుల్లో మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. అప్పుడు మలయాళంతోపాటు తెలుగు వెర్షన్‌ ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తారని టాక్. అయితే, థియేటర్లలో ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమా పోటీ ఉండగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5నే రిలీజ్ కానుంది.

ఇలా టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాల పోటీ వల్ల మంజుమ్మల్ బాయ్స్ సినిమాను వారం రోజులకంటే ఎక్కువగా థియేటర్లలో ప్రదర్శించే అవకాశం లేదని తెలుస్తోంది. థియేట్రిలక్ రిలీజ్ కాగానే వెంటనే ఓటీటీలోకి మలయాళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇప్పుడీ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్, అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.