Rebel Moon 2 OTT: నేరుగా ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్.. రేపే తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Rebel Moon Part Two The Scargiver OTT Streaming: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన జాక్ స్నైడర్ తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రెబల్ మూన్. దీనికి కొనసాగింపుగా రెబల్ మూన్ పార్ట్ 2 తెరకెక్కించారు. ఇప్పుడు మరికొన్ని గంటల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Rebel Moon Part 2 The Scargiver OTT Release: హాలీవుడ్ దర్శక దిగ్గజాల్లో జాక్ స్నైడర్ ఒకరు. ఆయన దర్శకత్వంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమా రెబల్ మూన్ పార్ట్ 1 ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్. అయితే, జాక్ స్నైడర్ టేకింగ్‌పై ఉన్న భారీ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. ఓవరాల్‌గా మూవీ బాగున్నప్పటికీ జాక్ స్నైడర్ వంటి డైరెక్టర్ సినిమా కాదని పలు కామెంట్స్ వినిపించాయి.
నెక్ట్స్ లెవెల్ సీన్స్, బీజీఎమ్
అలాంటి సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిందే రెబల్ మూన్ పార్ట్ 2 ది స్కార్గివర్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్‌తో అసంతృప్తి చెందిన జాక్ అభిమానులు ఈ సినిమాతో హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రెబల్ మూన్ 2 ట్రైలర్ అభిమానులను బాగా సర్‌ప్రైజ్ చేసింది. సినిమాలోని యాక్షన్ సీన్స్, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. దాంతో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు.
నోబుల్ బతికే ఉండటంతో
రెబల్ మూన్ మొదటి పార్ట్ గతేడాది డిసెంబర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలైంది. మదర్ వరల్డ్‌ను శాసించే అట్టికస్ నోబుల్‌ను ఎదురించేందుకు కోరా కొంతమంది తిరుగుబాటు దారులను కలుసుకుంటుంది. తిరుగుబాటుదారలను కలుసుకునే క్రమంలో ఏర్పడిన సమస్యలతో రెబల్ మూన్ మొదటి భాగం ఉంటుంది. అందులో అట్టికస్ నోబుల్ చంపేశామని కోరా టీమ్ అనుకుంటుంది. కానీ, అట్టికస్ నోబుల్ బతికే ఉన్న సీన్‌తో రెబల్ మూన్ ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుంది.
మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్
నోబుల్ బతికున్న విషయం తెలుసుకున్న కోరా మదర్ వరల్డ్ నుంచి ప్రజలను కాపాడుకోవడం చేసే పోరాటంతో రెబల్ మూన్ ది స్కార్గివర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. రెబల్ మూన్ 2 సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 19 నుంచి అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 19 అర్థరాత్రి నుంచే రెబల్ మూన్ 2 తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
అసలు కథ కోసం
ఇక రెబల్ మూన్ 2 ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. మొదటి పార్ట్‌పై వచ్చిన విమర్శలకు సెకండ్ పార్ట్ గట్టి సమాధానం చెప్పేలా అనిపిస్తోంది. మొదటి భాగం విడుదలయ్యాక మంచి రివ్యూలు రాకపోవడంతో రెండో భాగం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుందని, ఏప్రిల్ 19న అసలు కథ కోసం ఎదురు చూస్తున్నామని, మొదటి సినిమా కంటే ఇంకా బాగా వస్తుందని ఆశిస్తున్నామని ఓ అభిమాని కామెంట్ చేశాడు.
ట్రైలర్‌పై కామెంట్స్
"ఇది అద్భుతంగా ఉంది. మొదటి సినిమా ఓకే అనిపించినా ఈ సినిమా ఇంకా బెటర్‌గా కనిపిస్తోంది. తప్పకుండా చూస్తాను'' అని మరొ అభిమాని రెబల్ మూన్ ట్రైలర్‌పై కామెంట్ చేశాడు. ఇక ట్రైలర్‌లో మదర్ వరల్డ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసే కోరా అండ్ తిరుగుబాటుదారుల గాథతో కొనసాగనున్నట్లు చూపించారు. అలాగే మదర్ వరల్డ్‌ను ఎదుర్కొనేందుకు ప్రశాంతంగా జీవణం సాగిస్తున్న వెల్డ్ రైతులు కూడా పోరాటం చేయనున్నారని తెలుస్తోంది.