Animal: ఇలాంటి సినిమాలు మలయాళంలో చూస్తుంటాం: యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga At Pottel Teaser Launch: యానిమల్ సినిమాతో మరోసారి తన మార్క్ ఏంటో చూపించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా పొట్టేల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పొట్టేల్ మూవీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సందీప్ రెడ్డి వంగా.
Sandeep Reddy Vanga About Pottel: బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల, యువ చంద్రకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పొట్టేల్. డైరెక్టర్ సాహిత్ మోత్కురి దర్శకత్వం వహించిన ఈ సినిమాను NISA ఎంటర్టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. తాజాగా పొట్టేల్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా పొట్టేల్ మూవీపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ చేశారు. "సాహిత్తో నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఈ కథ ఫోన్‌లో చెప్పాడు. మొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. పొట్టెల్ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి" అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.
"మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక, అనన్య అందరికీ ఆల్ ది బెస్ట్. సాహిత్‌కి ఇది రెండో సినిమా. తన మొదటి సినిమా బంధం రేగడ్ నాకు చాలా ఇష్టం" అని సందీప్ రెడ్డి తెలిపారు.
"పొట్టెల్ టీజర్ చూసినప్పుడు తన ఆనుకున్న కథ తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. అజయ్ గారి లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. టీజర్ అందరినీ టీజ్ చేసిందని భావిస్తున్నాను. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
"సందీప్ అన్న టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్, సందీప్ అన్నకి థాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని డైరెక్టర్ సాహిత్ మోత్కురి తెలిపారు.
"మీ అందరి స్పందన చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని అర్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా గారు మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా ఉంది టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్‌లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది" అని హీరోయిన్ అనన్య నాగళ్ల తెలిపింది.
"సాహిత్ చాలా అద్భుతమైన కథ చెప్పాడు. దాని కంటే అద్భుతంగా తీశాడు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎమోషన్స్‌తో ఉన్న కమర్షియల్ సినిమా ఇది. సాహిత్ పెద్ద దర్శకుడు అవుతాడు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది బెస్ట్ రోల్. సందీప్ గారు రావడం వలన టీజర్ రీచ్ మరో స్థాయికి వెళ్లింది'' అని నటుడు అజయ్ తెలిపాడు.