KCR Double Ismart: వివాదంలో డబుల్ ఇస్మార్ట్ సాంగ్- కేసీఆర్‌ను కించపరిచారంటూ ఫైర్- ఏం జేద్దామంటవ్ మరీ!-double ismart maar muntha chod chintha song into controversy by using kcr voice ram pothineni puri jagannadh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kcr Double Ismart: వివాదంలో డబుల్ ఇస్మార్ట్ సాంగ్- కేసీఆర్‌ను కించపరిచారంటూ ఫైర్- ఏం జేద్దామంటవ్ మరీ!

KCR Double Ismart: వివాదంలో డబుల్ ఇస్మార్ట్ సాంగ్- కేసీఆర్‌ను కించపరిచారంటూ ఫైర్- ఏం జేద్దామంటవ్ మరీ!

Sanjiv Kumar HT Telugu

KCR Double Ismart Maar Muntha Chod Chintha Controversy: పూరీ జగన్నాథ్ తెరెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా వివాదంలో చిక్కుకుంది. తాజాగా విడుదలైన మార్ ముంత చోడ్ చింత సాంగ్‌లో కేసీఆర్ వాయిస్ ఉపయోగించడంతో మాజీ ముఖ్యమంత్రిని అవమానపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి.

వివాదంలో డబుల్ ఇస్మార్ట్ సాంగ్- కేసీఆర్‌ను కించపరిచారంటూ ఫైర్

KCR Double Ismart Song Controversy: ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రెండోసారి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. స్వీయ దర్శకత్వంతోపాటు పూరీ కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్ నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

కాంట్రవర్సీగా మారిన సాంగ్

తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌గా మార్ ముంత చోడ్ చింత పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ పాటే కాంట్రవర్సీకి తెరలేపింది. అయితే, ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. దీంతో పాటపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

కల్లు బాటిల్స్ పట్టుకుని

దాంతో పూరి జగన్నాథ్‌తోపాటు రైటర్, మ్యూజిక్ డైరెక్టర్‌లపై తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు గుస్సా అవుతున్నారు. అయితే, ఈ మార్ ముంత చోడ్ చింత పాట కల్లు కాంపౌండ్‌లో జరుగుతుంటుంది. హీరో హీరోయిన్, ఓ గ్రూప్ కల్లు బాటిల్స్ పట్టుకుని స్టెప్పులేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ మాట్లాడిన పాపులర్ డైలాగ్స్‌లలో ఒకటైన "ఏం జేద్దామంటవ్ మరీ" పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు.

తాగుడు అర్థం వచ్చేలా

ఆ పాటలో రెండు సార్లు మాజీ సీఎం కేసీఆర్ వాయిస్‌తో "ఏం జేద్దామంటవ్ మరీ" డైలాగ్ వినిపిస్తుంది. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ అంటే తాగుడూ.. తెలంగాణ అంటే తాగుడు అనే అర్థం వచ్చేలా పాట మధ్యలో మాజీ సీఎం వాయిస్ ఉపయోగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది అవమానించడమే

తెలంగాణ కల్చర్‌ను తాగుడూ సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శిస్తున్నారు. అసలు పాటలో కేసీఆర్ హుక్ లైన్ వాడటంలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. డైరెక్టర్‌కు ఎలాంటి తరహాలో అయిన పాటను చిత్రీకరించుకునే స్వేచ్ఛ ఉంటుంది. అలా అని పదేళ్లు రాష్టానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాయిస్‌ను కల్లు కాంపౌండ్ పాటలో ఉపయోగించడం ఏంటని, ఇది కేసీఆర్‌ను అవమానించడమే అని అభ్యంతరం తెలుపుతున్నారు.

రైటర్-సింగర్‌పైనా విమర్శలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పైనే కాకుండా పాట రచయిత కాసర్ల శ్యామ్‌, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారు అయి ఉండి అలా కేసీఆర్ డైలాగ్‌ను వాడటాన్ని ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని కించపరచడం ఏంటని నెట్టింట్లో చర్చ పెడుతున్నారు.

ప్రత్యమ్నాయం ఏంటీ

మరి ఈ విషయంపై డబుల్ ఇస్మార్ట్ టీమ్ నుంచి ఎవరు ఇంకా స్పందించలేదు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లేదా సద్దుమణుగుతుందా అనేది చూడాలి. పాటలో డైలాగ్ తీసేసి మార్పులు ఏమైనా చేస్తారా.. అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

సీక్వెల్‌గా

ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిందనే విషయం తెలిసిందే.