Double Ismart: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!-ram pothineni double ismart steppa maar song release date announced puri jagannadh ram pothineni new movie updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

Double Ismart: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Jun 29, 2024 08:15 AM IST

Double Ismart Steppa Maar Song Release Date: రామ్ పోతినేని లేటెస్ట్ క్రేజీ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని మొదటి సింగిల్ సాంగ్ స్టెప్పా మార్ పాట విడుదల తేదిని మేకర్స్ అనౌన్స్ చేశారు.

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

Ram Pothineni Double Ismart Update: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్‌'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా ప్రారంభించారు. ఇందులో భాగంగానే మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్‌కి చార్ట్-బస్టర్ ఆల్బమ్‌, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'స్టెప్పా మార్' పాట విడుదల తేదిని ఇటీవల అనౌన్స్ చేశారు మేకర్స్.

డబుల్ ఇస్మార్ట్ స్టెప్పా మార్ సాంగ్‌ను జూలై 1న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసినట్లుగా పోస్టర్ అద్భుతంగా ఉంది.

ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్‌గా మాస్ ప్రేక్షకులకు ఇన్‌స్టంట్ ఎడిక్షన్ కానుందని మేకర్స్ నమ్ముతున్నారు. రామ్ పోతినేని డ్యాన్స్ మూవ్స్ పాటలో ప్రధాన హైలైట్‌గా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ని అందించారు. దీంతో ఈ పాట కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో, యాక్టర్ సంజయ్ దత్ ఇందులో మెయిన్ విలన్‌గా చేస్తున్నారు. అంటే రామ్ పోతినేనికి దీటైనా విలన్‌గా సంజయ్ దత్ కనిపించనున్నారు. కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్‌తోపాటు ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ, జబర్దస్త్ గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, షయాజీ షీండే, టెంపర్ శ్రీను, వీజే బని తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు. కాగా ఇటీవల విడుదల చేసిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉంది. మరోసారి పూరి, రామ్ పోతినేని కాంబో మ్యాజిక్ రిపీట్ కానుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. టీజర్ ప్రారంభం కావడంతోనే గన్స్, బూతులు వినిపిస్తాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, నాకు తెల్వకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ పోతినేని తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ ఆకట్టున్నాయి.

WhatsApp channel