Double Ismart: డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆయుధాలతో రామ్ పోతినేని.. అదిరిపోయిన అప్డేట్-ram pothineni double ismart 100 days countdown poster released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart: డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆయుధాలతో రామ్ పోతినేని.. అదిరిపోయిన అప్డేట్

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆయుధాలతో రామ్ పోతినేని.. అదిరిపోయిన అప్డేట్

Sanjiv Kumar HT Telugu
Nov 30, 2023 07:31 AM IST

Ram Pothineni Double Ismart: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విడుదల తేది ప్రకటిస్తూ అందులో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆయుధాలతో రామ్ పోతినేని.. అదిరిపోయిన అప్డేట్
డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆయుధాలతో రామ్ పోతినేని.. అదిరిపోయిన అప్డేట్

Double Ismart Updates: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో మెయిన్ లీడ్ రోల్స్‌తో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. 'డబుల్ ఇస్మార్ట్‌' మూవీని మార్చి 8, 2024న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదల తేదీని స్పష్టం చేయడానికి మేకర్స్ వంద రోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ పోస్టర్‌లో రామ్ పోతినేనిని ట్రెండీ హెయిర్‌డో, షేడ్స్ ధరించి సూపర్ స్టైలిష్ ఇంకా మ్యాసీవ్ అవతార్‌లో కనిపించాడు. షర్టు, జీన్స్‌తో జాకెట్ ధరించి, తుపాకీని పట్టుకొని టెర్రిఫిక్ గా కనిపించాడు రామ్. అంతేకాకుండా రామ్ వెనుక చాలా వెపన్స్ ఉన్నాయి. ఈ పోస్టర్‌ను రివర్స్‌లో ప్రజంట్ చేసి క్యూరియాసిటీ పెంచారు. దీంతో సినిమాలో మాస్, యాక్షన్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్‌తో సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ 'డబుల్ ఇస్మార్ట్‌'కు సంగీతం అందిస్తున్నారు. రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8న థియేటర్లలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. మూవీ విడుదలకు ఇంకా 100 రోజులు ఉంది. అయితే, డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు.