Maar Muntha Chod Chintha: డబుల్ ఇస్మార్ట్ నుంచి రెండో సాంగ్ మార్ ముంత చోడ్ చింతా.. రిలీజ్ ఎప్పుడంటే?
Double Ismart Second Single Release Date: ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మరో క్రేజీ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ అయిన మార్ ముంత చోడ్ చింతా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
Double Ismart Maar Muntha Chod Chintha: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఇదివరకు విడుదలైన ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సెన్సేషనల్ హిట్‌గా మారింది.
ఈ స్టెప్పా మార్ పాటను జూలై 1న విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి ఆ పాట యూట్యూబ్‌లో ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుని మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాట తర్వాత మేకర్స్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత గురించి అప్‌డేట్ ఇచ్చారు.
ఈ మార్ ముంత చోడ్ చింత పాట రిలీజ్ డేట్‌ను దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జూలై 16న అంటే మరో రెండు రోజుల్లో ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఓ పోస్టర్ కూడా పోస్ట్ చేశారు. అయితే, మార్ ముంత చోడ్ చింత అనేది డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరో పాపులర్ డైలాగ్. దానికి తగినట్లుగా ఆ పోస్టర్ డిజైన్ ఉంది.
ఆ పోస్టర్‌లో రామ్ పోతినేని ఒకేసారి రెండు బాటిళ్ల కల్లును తాగుతూ కనిపించాడు. తన ఔట్‌ఫిట్ మాత్రం చాలా ట్రెండీగా, స్టైలిష్‌గా ఉంది. పోస్టర్ సూచించినట్లు ఈ పాట మాస్ బ్లాస్ట్‌ను అందించనుందని తెలుస్తోంది. సెట్ వైబ్రెంట్‌గా రామ్ లుక్ కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పూరి, మణిశర్మ కాంబోలో వచ్చిన సినిమాల్లోని చాలా వరకు పాటలు చాట్ బస్టర్స్‌గా నిలిచాయి.
ఇప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని పాటలు కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంటాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్‌తోపాటు సీనియర్ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేనికి పవర్ ఫుల్ విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రామ్ పోతినేని సరసన హీరోయిన్‌గా కావ్య థాపర్ చేస్తోంది. ఈ చిత్రానికి శామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
అయితే, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం అటు పూరీ, ఇటు రామ్ పోతినేని అభిమానులు చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఇదివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. మరోసారి ఆ మార్క్ చూపిస్తారా అని ఫ్యాన్స్‌తోపాటు ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్నారు.