Brahmamudi October 1st Episode: బ్రహ్మముడి.. రుద్రాణిని తిట్టిన అనామిక.. అత్తపై స్వప్నకు డౌట్.. తప్పు చేశానన్న సామంత్
Brahmamudi Serial October 1st Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో రాజ్ రాత్రంతా కష్టపడి డిజైన్స్ వేస్తాడు. మరోవైపు అనామికతో మాట్లాడిన రుద్రాణి మాటలు వింటుంది స్వప్న. దాంతో రుద్రాణిపై డౌట్‌తో ఎక్స్‌పోకు రుద్రాణితోపాటు స్వప్న కూడా వెళ్లాలనుకుంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్ ఆటో నడపడం గురించి తెలిసిన అప్పు కోపంగా వెళ్తుంది. కస్టమర్‌ను కల్యాణ్ తీసుకెళ్తాడు. మరోవైపు రాజ్‌తోపాటు ఆఫీస్ ఎంప్లాయిస్ అంతా డిజైన్స్ వేయడానికి తంటాలు పడుతుంటారు. ఇంతలో తాము వెళ్తామని, నువ్ కూడా రమ్మని శ్రుతిని అడుగుతారు ఇతర ఉద్యోగులు. నాకు రావడం కుదరదు, లోపల నా మొగుడు ఉన్నాడే అని చెప్పిన శ్రుతి నాలుక కరుచుకుంటుంది.
ఇలా అనేసానేంటీ.. బాస్ ఉన్నారు కదా. రావడం కుదరదు అని శ్రుతి అంటుంది. శ్రుతికి కొంతమంది డిజైన్స్ ఇస్తారు. రాత్రి పదిన్నర అవుతుందని నిద్రతో కుర్చీలోనే కునుకు వేస్తుంది శ్రుతి. రాజ్ మాత్రం డిజైన్స్ కోసం కష్టపడుతూనే ఉంటాడు. మరోవైపు కావ్య భోజనం చేస్తుంటుంది. ఇంతలో కావ్యకు అనామిక మేనేజర్ సురేష్ కాల్ చేసి, మీరు వేసిన డిజైన్స్‌కు అప్రూవల్ వచ్చిందని, రేపు జరిగే ఎక్స్‌పోలో నాతోపాటు వస్తే వచ్చే క్లైంట్స్‌కు పరిచయం చేస్తాను అని చెబుతాడు.
అల్లుడు గారు కూడా
ఆ ఎక్స్‌పోకు ఆయన కూడా వస్తారు. నేను రాకపోవడమే మంచిది అనుకున్న కావ్య రానని చెబుతుంది. అక్కడికి వస్తే క్లైంట్స్‌కు ఏం కావాలో మీకు బాగా తెలుస్తోంది. మీరేం చెప్పకండి వస్తున్నారు అంతే అని కాల్ కట్ చేస్తాడు సురేష్. ఆయన అంతలా అడుగుతుంటే ఎందుకు వెళ్లను అంటావేంటీ అని కనకం అంటుంది. లేదమ్మా అక్కడికి మీ అల్లుడు గారు కూడా వస్తారు అని కావ్య అంటే.. హో.. ఆయన వస్తే నువ్ కరిగిపోయి ఎక్కడ దగ్గర అవుతాననే భయమా అని కనకం అంటుంది.
అంతలేదు. నేనేం కరగను. ఆయన చెప్పారని కాదు. నువ్ అన్నావని వెళ్తాను అని కావ్య అంటుంది. మరోవైపు శ్రుతి దగ్గరికి వచ్చి లేపుతాడు రాజ్. డిజైన్స్ వేశాను. రేపు టైమ్ వరకు ఎక్స్‌పోకు పంపించు. ఓకే అని నిద్రపోవడం కాదు. ఎక్స్‌పోలో మనకే అవార్డ్ రావాలి అని రాజ్ అంటాడు. డిజైన్స్ చాలా బాగున్నాయి. మనకే అవార్డ్ అని శ్రుతి అంటుంది. మీ పని మీరు చేస్తే.. నేను ఇలా రాత్రి వరకు పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని రాజ్ వెళ్లిపోతాడు.
సర్ కూడా మంచి డిజైనరే.. కానీ, కావ్య అంతలా కాదు. అసలు మేడమ్ సర్‌ని ఎలా భరించిందో.. ఆమెకు చేతులెత్తి మొక్కాలి అని శ్రుతి అనుకుంటుంది. మరోవైపు కావ్య వేసిన డిజైన్స్ గురించి రుద్రాణికి కాల్ చేసి అనామిక చెబుతుంది. దాంతో సంతోషపడుతూ నిజమా అంటుంది రుద్రాణి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర మాత్రమే కాదు మీలాంటి దొంగ దగ్గర కూడా నిజాలు చెప్పాలి ఆంటీ అని అనామిక అంటుంది. దొంగా.. నేనా.. సరే తిడితే తిట్టావ్ గానీ, ఇంతకీ ఆ కావ్యను వాడుకుని రాజ్‌ను ఎలా దెబ్బకొడుతున్నావ్ అని రుద్రాణి అడుగుతుంది.
ఇదే సమస్య నీతో
తన ప్లాన్ చెబుతుంది అనామిక. సొంత భార్య చేతిల్లోనే రాజ్ ఓడిపోతున్నాడు కాబట్టి రాజ్ తట్టుకోలేడు. దాంతో వాళ్లిద్దరు శాశ్వతంగా విడిపోతారు. కావ్య శత్రువుగా మిగిలిపోతుంది అని రుద్రాణి అంటుంది. తర్వాత నేను కొట్టబోయే దెబ్బకు దుగ్గిరాల ఫ్యామిలీతోపాటు వెళ్లిపోయిన కల్యాణ్ కూడా నన్ను వెళ్లగొట్టినందుకు బాధపడతారు అని అనామిక అంటుంది. నీతో వచ్చిందే ఇదే సమస్య. ముందు కావ్య, రాజ్‌పై ఫోకస్ పెట్టు అని రుద్రాణి అంటుంది.
ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరు పర్మినెంట్‌గా శత్రువులు అవ్వడానికి అంతా సిద్ధమైందని అనామిక చెబుతుంది. రేపు వాళ్లిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు రియాక్షన్ చూడాలి. నేను కూడా ఎక్స్‌పోకు వస్తాను అని రుద్రాణి కాల్ కట్ చేస్తుంది. అదంతా విన్న స్వప్న డౌట్ పడుతుంది. మా అత్త ఎవరితోనో గూడు పుటాని చేస్తుంది. ఏం మాట్లాడిందో అర్థం కాలేదు కానీ, రేపు ఎక్స్‌పోకు కావ్య వస్తుంది. ఏదో గొడవ పెట్టబోతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను కూడా ఎక్స్‌పోకు వెళ్లాలి అని స్వప్న అనుకుంటుంది.
కల్యాణ్ ఇంటికి వస్తాడు. అప్పు కోపంగా ఉంటుంది. మోసం చేశావని అంటుంది. మోసం ఏంటీ.. ఆటో నడుపుతున్నాను అంటే ఒప్పుకుంటావా. బాధపెట్టడం ఇష్టం లేక చెప్పలేదని కల్యాణ్ అంటాడు. మేడమీదకు అప్పు వెళితే.. జాబిలమ్మా నీకు అంతా కోపమా అనే పాట పాడుతాడు కల్యాణ్. దాంతో అప్పు నవ్వి ఊరుకుంటుంది. తర్వాత కల్యాణ్ ఆటో నడపడంపై వివరణ ఇస్తాడు. నువ్ కోరుకున్న జీవితం వదిలేసి ఆటో నడపడం అవసరమా. నేను కూడా పనులు చేస్తాను అని అప్పు అంటుంది.
అర్థం చేసుకున్న అప్పు
ఇద్దరూ ఆటో నడపడటం, పిజ్జా డెలీవరీపై మాట్లాడుకుంటారు. నాకు నచ్చిన పని కూడా చేస్తున్నాను. నాకు సరైంది దొరికేవరకు ఆటో నడపడం వదిలేస్తాను. నువ్ ఎస్సై అయ్యాక ఆటో నడపడం వదిలేస్తాను. మనం అనుకున్నది సాధిస్తాం. ఈ చిన్న కష్టం చూసి మనం వెనుకడుగు వేయకూడదు అని కల్యాణ్ చెబుతాడు. దాంతో కల్యాణ్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటుంది అప్పు. ఎక్స్‌పోకు కావ్య వెళ్తుంటే కనకం ఆపి.. అల్లుడు గారు వచ్చి పలకరిస్తే.. నువ్ మాట్లాడు. పొగరుగా సమాధానం ఇవ్వకు అని అంటుంది.
ఆయన సరిగ్గా మాట్లాడితే నేను మాట్లాడతాను. నేను వెళ్లేది కంపెనీ పని మీద. మీ అల్లుడితో ముచ్చట్లు పెట్టుకునేందుకు కాదని కావ్య వెళ్లిపోతుంది. దేవుడా వాళ్లిద్దరిని ఒక్కటి చేయవయ్యా అని కనకం కోరుకుంటుంది. మరోవైపు రాజ్‌కు అవార్డ్ రావాలని అపర్ణ ఇస్తుంది. వాళ్లు వెళ్లిపోతుంటే.. రుద్రాణి వచ్చి తాను కూడా వస్తానంటుంది. అందరూ షాక్ అవుతారు. నీ అంతట నువ్వు వెళ్తాను అంటున్నావా అంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుందని స్వప్న అంటుంది.
నువ్ అడుగుపెడితే అవార్డ్ ఫంక్షన్ ఏమవుతుందో అని ప్రకాశం అంటాడు. నన్ను మరి ఐరన్ లెగ్ శాస్త్రికి అక్కలా చేయకండి. నేను కూడా ఇంటి మంచికోరుకుంటాను అని రుద్రాణి అంటుంది. ఇదెప్పటి నుంచో అని అపర్ణ అడిగితే.. నాకు నమ్మకం లేదని స్వప్న అంటుంది. వస్తానని ముచ్చటపడుతుంది కదా. ఇంతమంది ఇన్ని మాటలు అనడం అవసరమా. రానివ్వండి అని రాజ్ అంటాడు. నాదో కండిషన్ నేను కూడా వస్తాను అని స్వప్న అంటుంది.
తప్పు చేశాననిపిస్తుంది
ఎద్దును ముల్లుతోటి అదిమించాలి కదా అని ప్రకాశం అంటాడు. నీకు కరెక్ట్ మొగుడు స్వప్నే. రానివ్వని అని సుభాష్ అంటాడు. సరే ఏడవమను అని రుద్రాణి అంటే.. నేనేందుకు ఏడుస్తాను అత్త. నేను ఏడిపించే రకం అని స్వప్న అంటుంది. అంతా బయలుదేరుతారు. మరోవైపు ఎక్స్‌పోలో చాలా మందే వచ్చారు అని అనామిక అంటుంది. ఎంతమంది వచ్చినా కరెక్ట్ అపోనెంట్ రాజ్. అవార్డ్ వచ్చేవరకు నాకు టెన్షనే అని సామంత్ అంటాడు.
ఎందుకు టెన్షన్ పడతావ్. కావ్యపై నాకు నమ్మకం ఉందని అనామిక అంటుంది. ఆ నమ్మకంతోనే రాజ్‌తో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు అలా చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. నీకు రాజ్ సంగతి పూర్తిగా తెలియదు. నవ్వుతూ మాట్లాడితే అందరిలాంటి వాడే అనుకున్నావ్. ఒక్కసారి తను అనుకుంటే సాధించేవరకు ఊరుకోడు. తనను తప్పుగా ప్రవర్తించి ఎదురెళ్తే.. ఓడించి తీరుతాడు అని సామంత్ అంటాడు. బిజినెస్ విషయంలో రాజ్ గురించి నాకు తెలియదు. కానీ, కావ్య గురించి బాగా తెలుసు అని అనామిక అంటుంది.
అది కాదు అని సామంత్ టెన్షన్ పడుతుంటే.. సామంత్.. అని మెడపై చేయి వేసి కంట్రోల్ చేస్తుంది అనామిక. అర్థమైంది బేబీ. కూల్‌గా ఉండాలి అంతే కదా అని సామంత్ అంటాడు. కావ్యను రాజ్ వాళ్లు చూస్తారు. తర్వాత ఇకనుంచి మీకు అడుగడుగునా మేము అడ్డు వస్తాం. పోటీ ఈ ఎక్స్‌పో నుంచి మొదలు కానుందని రాజ్‌తో సామంత్ ఛాలెంజ్ చేస్తాడు. అదంతా విన్న కావ్య షాక్ అవుతుంది.