TDP Janasena Manifesto :టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల-మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ,ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు-vijayawada tdp janasena manifesto released chandrababu pawan kalyan announced mega dsc woman free journey ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Janasena Manifesto :టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల-మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ,ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

TDP Janasena Manifesto :టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల-మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ,ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

Bandaru Satyaprasad HT Telugu
Apr 30, 2024 08:57 PM IST

TDP Janasena Manifesto : టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు.

ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

TDP Janasena Manifesto : ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో(TDP Janasena Alliance Manifesto)ను టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) విజయవాడలో విడుదల చేశారు. ప్రజాగళం పేరిట మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. యువగళం ద్వారా టీడీపీకి వచ్చిన విజ్ఞప్తులు, జనవాణి ద్వారా జనసేనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టో (Manifesto)రూపొందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. టీడీపీ సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం అంశాలతో పాటుగా అన్ని వర్గాలకు సంక్షేమం కల్పించే అంశాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

"సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల ఆర్థిక సాయం, 217 జీవో రద్దు, సాంకేతిక సహకారం అందిస్తాం. కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తాం. చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారస్తులకు ఒత్తిడి లేని, స్వే్చ్ఛాయుత వ్యాపారం జరిగేలా చేస్తాం.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు(AP Land Titling Act) చేస్తాం. మహిళలకు అండగా నిలబడేందుకు చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేల ఆర్థిక సాయం(Financial Assistance), మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అందించేందుకు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతీ ఒక్కరికీ ప్రతీ నెలా రూ.1,500 ఆర్థిక సాయం, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు(Free Gas Cylinders) అందిస్తాం. అధికారంలోకి రాగానే DSC నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేస్తాం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు(Jobs), నిరుద్యోగ యువతకు 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం. పేదలకు ఉచిత ఇసుక అందిస్తాం, JP వెంచర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక దోపిడీని అరికడతాం. పరిశ్రమలకు అనుకూలమైన పాలసీలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొస్తాం, ఉపాధి కల్పిస్తాం. BC డిక్లరేషన్ అమలు చేస్తాం, వారి కోసం నిధులు ఖర్చుపెడతాం" - పవన్ కల్యాణ్

జనసేన షణ్ముఖ వ్యూహం

  • ఇంటింటికీ రక్షిత మంచినీరు
  • స్కిల్ సెన్సస్, దేశంలోనే తొలి సారిగా నైపుణ్య గణన
  • స్టార్టప్ సంస్థలకు 10 లక్షల ఆర్థిక ప్రోత్సాహకం
  • EWS రిజర్వేషన్లు
  • ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ (Land Titling Act Cancel)పేరుతో జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులు దోచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సోలార్ పంపుసెట్లు అందించి, కరెంట్ ఉచితంగానే(Free Power) అందేలా చేస్తామన్నారు. మిగులు విద్యుత్ ను పవర్ గ్రిడ్(Power Grid) కు అందించి ఆర్థికంగా కూడా చెల్లింపు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్ట్, సెజ్, గంగవరం పోర్టు, సినిమా స్టూడియోలు, గెలాక్సీ గ్రానైట్ కంపెనీ ఎందుకు చేతులు మారాయని ప్రశ్నించారు. బలవంతంగా బెదిరించి ప్రజల ఆస్తులు నచ్చిన వారి పేరుమీద రాయించుకుంటున్నాయన్నారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి కేటాయిస్తామన్నారు. ఇప్పటికే పూర్తైన TIDCO ఇళ్లు పేదలకు అందిస్తామన్నారు. వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ (Pension)ఏప్రిల్ నుంచే అమలు జరిగేలా చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేస్తామని, నదులు అనుసంధానం చేస్తామని మేనిఫోస్టోలో ప్రకటించారు.

నాసిరకం మద్యం రద్దు చేస్తాం

"మద్యం ధరలు(Liquor Rates) తగ్గిస్తాం, విషపూరిత నాసిరకపు మద్యం రద్దు చేస్తాం, కల్తీ మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతీ ఒక్కరికీ రూ.25 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి , ఇతర డ్రగ్స్ అరికడతాం, ఉక్కుపాదం మోపుతాం. జగన్ ప్రజలకు నీరు ఇవ్వలేకపోయారు కానీ, గంజాయి ప్రతీ ఊర్లో దొరికేలా చేశారు. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి, గతుకుల లేని అధునాతన రోడ్ల నిర్మాణం చేపడతాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్ ద్వారా పంచాయితీలకు నిధులు ఇస్తాం, వారికి ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్(Good Governance) అందిస్తాం, శాంతి భద్రతలు పరిరక్షిస్తాం"- చంద్రబాబు

విశాఖను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం

మీడియా వారికి అందరికీ అక్రిడేషన్ కార్డులు, ఉచిత నివాసం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్నం(Visakhapatnam) నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. భావనపాడు పోర్టు(Bhavanapadu Port) అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ (Bhogapuram Airport)నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దేవాలయాల బోర్డులో కచ్చితంగా బ్రాహ్మణ వర్గాల వారిని మెంబర్ గా తీసుకుంటామన్నారు. వారికే ఆచార వ్యవహారాలపై అవగాహన ఉంటుందన్నారు. వక్ఫ్ బోర్డు తరహాలో హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కబ్జాలు అరికడతామన్నారు. ఆలయ ఆచారాల విషయంలో ఆలయ అర్చకుల నిర్ణయమే ఫైనల్, ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోదన్నారు. రాష్ట్రంలో అప్పు ఇచ్చే పరిస్థితి లేదు, ఆదాయం వచ్చే పరిస్థితి లేదు, జప్తు చేసే పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజా ప్రభుత్వం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

సంబంధిత కథనం