
(1 / 6)
విమానయాన రంగంపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడ్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పౌరులకు మరింత దగ్గర చేయడం కోసం కృషి చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో 200 విమానాశ్రయాలు ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
(ANI Picture Service )
(2 / 6)
Noida International Airport - Jewar, Uttar Pradesh -
నోయిడాలో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఏర్ పోర్ట్. ఇది ప్రారంభమైతే, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గుతుంది.
(india.com)
(3 / 6)
విశాఖ పట్టణానికి సమీపంలోని భోగాపురంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. జీఎంఆర్ గ్రూప్ దీన్ని నిర్మిస్తోంది. 2023 లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 2025 లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
(GMR/Twitter)
(4 / 6)
కర్నాటకలోని శివమొగ్గలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. తొలి దశను ఈ ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఏర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈ ఆగస్ట్ 11 నుంచి ప్రారంభమవుతాయి.
(Twitter\MLASudhakar)
(5 / 6)
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీగా పడుతున్న ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టారు. 2025 లో ఈ ఏర్ పోర్ట్ ఫస్ట్ ఫేజ్ అందుబాటులోకి వస్తుంది.
(Marathon)
(6 / 6)
మహారాష్ట్రలోని పుణెలో ఏర్పాటువుతోంది ఈ ఏర్ పోర్ట్. పుణె ప్రాంతంలో ఏర్పాటవుతున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పురందర్ ఏర్ పోర్ట్.
(Facebook)ఇతర గ్యాలరీలు