Nara Lokesh : అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం…నారా లోకేష్-tdp general secretary nara lokesh assures building construction workers for free sand when tdp comes in power ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం…నారా లోకేష్

Nara Lokesh : అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం…నారా లోకేష్

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 12:44 PM IST

Nara Lokesh టీడీపీ అధికారంలోకి వస్తే పాత విధానంలో ఇసుకను ఉచితంగా అందిస్తామని నారా లోకేష్ ప్రకటించారు. పలమనేరు జిల్లా భైరెడ్డి పల్లె మండలంలో యువగళం పాదయాత్ర ఆరో రోజు ప్రారంభమైంది. రైతులు, కార్మికులతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర సాగుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆరుగురు పారిశ్రామికవేత్తలు మాట్లాడితే అందులో 4 కంపెనీలు టిడిపి హయాంలో వచ్చాయని, ఒకటి వైఎస్, ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వచ్చిన కంపెనీలు అని, జగన్ హయాంలో వచ్చింది సున్నా అని లోకేష్ ఎద్దేవా చేశారు.

పలమనేరులో నారా లోకేష్ యువగళం యాత్ర....
పలమనేరులో నారా లోకేష్ యువగళం యాత్ర....

Nara Lokesh తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాత విధానాన్ని పునరుద్ధరించి ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని నారా లోకేష్ ప్రకటించారు. బైరెడ్డి పల్లె మండలం సాకే ఊరులో చెరుకు రైతులతో యువగళం యాత్రలో లోకేష్ ముచ్చటించారు. తనకి ఉన్న ఒకటిన్నర పొలం, బెల్లం గానుగను రైతు నారా లోకేష్‌కు చూపించారు. చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు లోకేష్ దృష్టికి తెచ్చిన చెరుకు రైతు, ఒకటిన్నర ఎకరాలో చెరుకు పంట వెయ్యడానికి 70 వేలు అవుతుందని, ఆదాయం 50 వేలు కూడా రావడం లేదని, పంట వేసి నష్ట పోతున్నామని వివరించారు.

yearly horoscope entry point

విత్తనం , కూలీ, ఎరువులు రేటు, పురుగుల మందు రేటు పెరిగిందని, బెల్లం గానుగకి తీసుకెళ్ళి బెల్లం తయారీ విధానం లోకేష్ కి వివరించారు. 760 కేజీలు బెల్లం అమ్మితే 21 వేలు వస్తున్నాయని, కనీసం 33 వేలు వస్తే తప్ప రైతుకి ఏమి మిగలదని చెప్పారు. రైతు భరోసా అందడం లేదని, ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మ ఒడి రావడం లేదని చెప్పారు. టిడిపి అధికారం వచ్చాకా చెరుకు రైతుల్ని ఆదుకోవాలని రైతు వెంకటరమణ కోరారు.

రాష్ట్రంలో చెరుకు రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, కనీస మద్దతు ధర లేక రైతులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని, రాష్ట్రంలో వైసిపిది రైతు వ్యతిరేక ప్రభుత్వమని లోకేష్ చెప్పారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందు కారణంగా రైతులు నష్టపోతున్నారని, వ్యవసాయానికి సాయం అందించడం తన బాధ్యత అన్నారు. టిడిపి అధికారం వచ్చిన వెంటనే చెరుకు రైతుల సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని పలమనేరు నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో లోకేష్ భరోసా ఇచ్చారు. బైరెడ్డి పల్లె మండలం బేలుపల్లె లో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గర కు వెళ్లి నారా లోకేష్ పలకరించారు.

జగన్ పాలన లో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేవారు. టిడిపి హయాంలో వెయ్యి రూపాయిలకు దొరికిన ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 3 వేల నుండి 5 వేల వరకూ అమ్మతున్నారని ఆరోపించారు. మొదటి మూడేళ్లు పనులు లేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పని దొరికి కూలీ వస్తున్నా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వలన బ్రతకలేని పరిస్థితి ఉందన్నారు.

చాలా చోట్ల నకిలీ ఇసుక అమ్ముతున్నారని, పైకి మాత్రమే ఇసుక కింద అంతా మట్టి పోస్తున్నారని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. అధికారంలోకి రాగానే పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించిందని లోకేష్ ఆరోపించారు. వైసిపి నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారని, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి పల్లె మండలం బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయిన నారా లోకేష్, వాల్మీకిలను జగన్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎస్టీల్లో చేర్చే అంశం పై అసలు స్పందించడం లేదన్నారు. వాల్మీకిలకు రుణాలు లేవు, ఉద్యోగాలు లేవుని గ్రామాల్లో వాల్మీకి యువత కర్ణాటక, తమిళనాడు వెళ్లి బ్రతుకుతున్నామని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాల్మీకిల స్థితిగతుల పై అధ్యయనం చేశామని, వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాల్మీకిలను ఎస్టీ ల్లో చేర్చాలని 2017 లో అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపామని గుర్తు చేశారు.

ప్రతిపక్షం లో ఉండి కూడా ప్రధాని మోదీ గారికి చంద్రబాబు గారు వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని పోరాడుతూ లేఖ రాశారని, వైసిపి కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా వాల్మీకి ల గురించి మాట్లాడటం లేదని, పోరాడటం లేదన్నారు. టిడిపి అధికారం లో ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ తో లోన్స్ ఇచ్చామని, వైసిపి పాలనలో ఒక్క వాల్మీకి కి రుణం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వాల్మీకి లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారని, వాల్మీకి సోదరులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Whats_app_banner