Powergrid Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హైదరాబాద్ రీజియన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మార్చి 8 నుంచి దరఖాస్తులు
Powergrid Jobs:కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో PowergridCorporation పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
Powergrid Jobs: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారత్న కంపెనీగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో PowergridCorporation of India పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ Notification జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పవర్ గ్రిడ్ దేశ వ్యాప్తంగా అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థల నియంత్రణ, నిర్వహణ కార్యకలాపాలను చేపడుతుంది.
జాతీయ స్థాయిలో విద్యుత్ నియంత్రణ, సరఫరా, కార్యకలాపాల నిర్వహణ, ప్రణాళికలు, సమన్వయ బాధ్యతలు, విద్యుత్ పంపిణీ పర్యవేక్షణ, నియంత్రణలు చేపడుతుంది. పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారంలో మహారత్న కంపెనీగా గుర్తింపు పొందింది.
సదరన్ రీజియన్ 1 పరిధిలో టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం అనుభవజ్ఞులైన యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపడతారు.
భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే....
ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంజనీర్ Engineer పోస్టులు 14 ఉన్నాయి. వీటిలో అన్ రిజర్వుడు పోస్టులు 6, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యుఎస్ 1, దివ్యాంగులు1, ఎక్స్ సర్వీస్ మెన్ 2 ఉన్నాయి. సివిల్ విభాగంలో 7 ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 4 అన్ రిజర్వుడు పోస్టులు, ఓబీసీ1, ఎస్సీ1, ఈడబ్ల్యుఎస్ 1 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్ వైజర్ క్యాటగిరీలో 12 పోస్టులు భర్తీ చేస్తారు. సివిల్ పీల్డ్ సూపర్‌వైజర్ విభాగంలో 7 పోస్టులు భర్తీ చేస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగుల్లో నిర్దేశిత అర్హతలు ఉన్న వారు లేకపోతే హరిజంటల్ రిజర్వేషన్‌తో భర్తీ చేస్తారు.
పూర్తి వివరాలకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన కెరీర్స్ విభాగంలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. పవర్ కార్పొరేషన్ హైదరాబాద్ రీజియన్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు www.powergrid.in లో నోటిఫికేష్ అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌లో Careers Sectionలో Job recruitment విభాగంలో Openingsలో Regional Openingsలో సౌత్ రీజియన్ హైదరాబాద్ విభాగంలో నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.
ఆన్‌లైన్ విండో ప్రారంభం...
ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మార్చి 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి స్వీకరిస్తారు. మార్చి 28వ తేదీ అర్థరాత్రి వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. పవర్ గ్రిడ్‌కు సంబంధించిన సదరన్ రీజియన్ 1 కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంటుంది. చిరునామా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ 1, రీజినల్ హెడ్ క్వార్టర్స్, నెం.6-6-8/32&395E, కవాడిగూడ మెయిన్ రోడ్, సికింద్రాబాద్-500080