Reliance Jio Bharat: జియో భారత్ రూ. 999 ఫోన్ లాంచ్; రూ. 123 తో మొబైల్ ప్లాన్స్ ను కూడా ప్రకటించిన రిలయన్స్ జియో-reliance jio launches jio bharat device at rs 999 aims to bridge digital divide with affordable plans ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio Bharat: జియో భారత్ రూ. 999 ఫోన్ లాంచ్; రూ. 123 తో మొబైల్ ప్లాన్స్ ను కూడా ప్రకటించిన రిలయన్స్ జియో

Reliance Jio Bharat: జియో భారత్ రూ. 999 ఫోన్ లాంచ్; రూ. 123 తో మొబైల్ ప్లాన్స్ ను కూడా ప్రకటించిన రిలయన్స్ జియో

HT Telugu Desk HT Telugu
Aug 11, 2023 08:20 PM IST

Reliance Jio Bharat: సామాన్యులకు కూడా ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జియో భారత్ ఫోన్ ను రిలయన్స్ జియో తీసుకువచ్చింది. రూ. 999 లకే ఈ ఫోన్ ను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేశారు. అలాగే, జియో భారత్ ఫోన్ ప్లాన్స్ ను కూడా శుక్రవారం ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio Bharat: సామాన్యులకు కూడా ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జియో భారత్ ఫోన్ ను రిలయన్స్ జియో తీసుకువచ్చింది. రూ. 999 లకే ఈ ఫోన్ ను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేశారు. అలాగే, జియో భారత్ ఫోన్ ప్లాన్స్ ను కూడా శుక్రవారం ప్రకటించింది.

రూ. 123.. రూ. 1,234

రూ. 999 లకు జియో భారత్ ఫోన్ ను శుక్రవారం రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఆ ఫోన్ తో పాటు ఈ ఫోన్ కే ప్రత్యేకమైన మొబైల్ ప్లాన్స్ ను కూడా జియో ప్రకటించింది. రూ. 123 లతో ఒక ప్లాన్ ను, రూ. 1234 లతో మరో ప్లాన్ ను ప్రకటించింది. రూ. 123 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ. 1234 ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. రూ. 123 ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 14 జీబీ మంత్లీ డేటా లభిస్తుంది. సాధారణంగా వేరే జియో ప్లాన్స్ 28 రోజుల వ్యాలిడిటీతో, 2జీబీ డేటాతో రూ. 179 ల నుంచి ప్రారంభమవుతాయి.

సంవత్సరం ప్లాన్..

రూ. 1234 తో తీసుకువచ్చిన జియో భారత్ ప్లాన్ లో సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతీ రోజు 0.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. భారత్ లో 25 కోట్ల మంది వినియోగదారులు ఇంకా 2జీ నెట్ వర్క్ పరిధిలోనే ఉన్నారన్నారు. ఇంటర్నెట్ ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో జియోను ప్రారంభించామన్నారు.

WhatsApp channel