TG GENCO Jobs 2024 : తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ రాత పరీక్ష తేదీలు ఖరారు - జూలై 3 నుంచి హాల్ టికెట్లు
- Telangana GENCO AE Chemist Exam Dates : తెలంగాణ జెన్ కో ఏఈ, కెమిస్ట్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల కోడ్ తో పరీక్షలు వాయిదా పడగా… తాజాగా జెన్ కో యాజమాన్యం కొత్త తేదీలను ప్రకటించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
- Telangana GENCO AE Chemist Exam Dates : తెలంగాణ జెన్ కో ఏఈ, కెమిస్ట్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల కోడ్ తో పరీక్షలు వాయిదా పడగా… తాజాగా జెన్ కో యాజమాన్యం కొత్త తేదీలను ప్రకటించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(2 / 6)
జులై 14వ తేదీన కంప్యూటర్ బేస్ట్ విధానంలో ఈ నియామకాలకు సంబంధించిన రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
(3 / 6)
జూలై 3వ తేదీ నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తాజా ప్రకటనలో వెల్లడించారు. https://tggenco.com/TGGENCO/getInfo.do వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
(4 / 6)
టీఎస్ జెన్ కో సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు పాత విద్యుత్ కేంద్రాలలో పనిచేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జెన్ కో ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.
(5 / 6)
మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు రెండుసార్లు ఈ పరీక్ష వాయిదా పడింది.
(6 / 6)
https://tggenco.com/ వెబ్ సైట్ లోకి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు