Reliance Jio Bharat: రిలయన్స్ జియో భారత్ సేల్స్ ప్రారంభం; 999 రూపాయలకే 4 జీ ఫోన్
Reliance Jio Bharat: రిలయన్స్ ఇటీవల లాంచ్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ 4 జీ ఫోన్ జియో భారత్ (Jio Bharat) సేల్స్ భారత్ లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధర రూ. 999. ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన లొకేషన్లలోనే ఇవి లభిస్తున్నాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
Reliance Jio Bharat: రిలయన్స్ ఇటీవల లాంచ్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ 4 జీ ఫోన్ జియో భారత్ (Jio Bharat) సేల్స్ భారత్ లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధర రూ. 999. ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన లొకేషన్లలోనే ఇవి లభిస్తున్నాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఫోన్ అమ్మకాలతో పాటు మొబైల్ ప్లాన్ ను కూడా జియో ప్రకటించింది. నెలకు రూ. 123 లతో రోజుకు 500 ఎంబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఫెసిలిటీతో జియో భారత్ మొబైల్ ప్లాన్ పేరుతో ఆ ప్లాన్ ను ప్రకటించింది.
జులై 7 నుంచి అమ్మకాలు..
రూ. 999 ల జియో భారత్ 4 జీ ఫోన్ అమ్మకాలు జులై 7 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ రాకతో భారత్ లో 2జీ సేవలకు ఇక ముగింపు పలికినట్లు అనుకోవచ్చు. భారత్ లో ప్రస్తుతానికి 10 లక్షల జియో భారత్ ఫోన్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని జియో ప్రకటించింది. ఈ ఫోన్ ను రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో కానీ, జియో రిటైల్ ఔట్ లెట్స్ లో కానీ, ఎంపిక చేసిన ఇతర మొబైల్ ఔట్ లెట్స్ లో కానీ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి జియో భారత్ వీ2, జియో భారత్ కే1. జియో భారత్ వీ2ని రిలయన్స్ జియో స్వయంగా అభివృద్ధి చేయగా, జియో భారత్ కే1 ని స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ కార్బన్ తో కలిసి అభివృద్ధి చేశారు.
రెండు రంగుల్లో..
జియో భారత్ వీ 2 మోడల్ యాష్ బ్లూ, సోలో బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ కు కెమెరా సదుపాయం కూడా ఉంది. 4జీ ని సపోర్ట్ చేస్తుంది. యూజర్లు ఈ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. జియో యాప్స్ లో సినిమాలు కూడా చూడవచ్చు. జియో భారత్ కే1 ఫోన్ డ్యుయల్ కలర్ ‘గ్రే అండ్ రెడ్’ లో లభిస్తుంది. దీనికి కూడా వెనుకవైపు కెమెరా ఉంటుంది. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్ లో సినిమాలు కూడా చూడవచ్చు.