AP Cabinet Meeting : పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు, రూ. 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పరిధి - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
AP Cabinet Meeting Updates: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదముద్ర వేయటంతో పాటు సామాజిక పెన్షన్లు రూ.3 వేలకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ.25లక్షల పెంపునకు ఆమోదం లభించగా… విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలపటంతో పాటు… సామాజిక పెన్షన్లు రూ.3 వేలకు పెంచేందుకు అనుమతి లభించింది. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదముద్ర వేయటమే గాక… జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..
-సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ.3,000లకు పెంపు.
-ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ.25లక్షల పెంపునకు ఆమోదం.
-విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదం.
-విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం.
-జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం.
-కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం.
-జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు.
-పలు వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం.
- మిచౌంగ్ తుపాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-'ఆడుదాం ఆంధ్రా' బ్రాండ్ అంబాసిడర్‌గా అంబటి రాయుడు నియామకం.
-ఆంధ్రప్రదేశ్ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతోపాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.