AP EAPCET Results 2024 : ఏపీ ఎంసెట్ అప్డేట్స్ - ఫలితాలు ఎప్పుడంటే...?-ap eamcet results 2024 likely to be out by 31st may or june first week latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Results 2024 : ఏపీ ఎంసెట్ అప్డేట్స్ - ఫలితాలు ఎప్పుడంటే...?

AP EAPCET Results 2024 : ఏపీ ఎంసెట్ అప్డేట్స్ - ఫలితాలు ఎప్పుడంటే...?

Maheshwaram Mahendra Chary HT Telugu
May 26, 2024 05:32 AM IST

AP EAPCET Results 2024 Updates: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 కీ లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు రాగా... ఏపీ ఎంసెట్ ఫలితాలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏపీ ఎంసెట్ ఫలితాలు - 2024
ఏపీ ఎంసెట్ ఫలితాలు - 2024

AP EAPCET(EAMCET ) Results 2024 Updates: ఏపీ ఈఏపీసెట్‌-2024 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలనే పరీక్షలు పూర్తి కాగా... ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా మే 26వ తేదీతో పూర్తి కానుంది. ఇది పూర్తి కాగానే ఫలితాలను ప్రకటించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

ఈసారి ఎంత మంది పరీక్షలు రాశారంటే..?

ఏపీ ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. .ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ను నిర్వహించారు.

ఏపీ ఈఏపీసెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. 15840మంది గైర్హాజరు అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లకు 88,638 మంది ఈఏపీ సెట్‌కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872మంది గైర్హాజరయ్యారు. ఈ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఈఏపీ సెట్‌ 2024కు మొత్తంగా 3,62,851 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 23712మంది గైర్హాజరు కావడంతో 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.

AP EAPCET Results 2024 Date : ఏపీ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడు రావొచ్చంటే...?

ఏపీ ఈఏపీసెట్ -2024 ఫలితాలను మే 31వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా ఇదే తేదీన ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇది కుదరకపోతే.... జూన్ ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ విడుదల కానున్నాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే ఫలితాలను ప్రకటించటమే కాకుండా... కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేశారు. దీంతో ఏపీలో కూడా సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

How to download AP EAMCET Results 2024 : ఇలా చెక్ చేసుకోవచ్చు....

  • Step 1: పరీక్ష రాసిన అభ్యర్థులు AP EAPCET అధికారిక వెబ్‌సైట్- https://cets.apsche.ap.gov.in/  లోకి వెళ్లాలి.
  • Step 2: AP EAPCET ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • Step 3: మీ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి నమోదు చేయాలి.
  • Step 4: మీ మార్కులు, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఇక తెలంగాణలో చూస్తే…. జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్‌ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్‌ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Whats_app_banner