(1 / 6)
(2 / 6)
జూన్ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
(image source from https://unsplash.com/)(3 / 6)
ఇక రెండో విడత కౌన్సెలింగ్ జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడో విడత జూలై 30వ తేదీ నుంచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 24వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండగా,ఆగస్టు 5వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు.
(4 / 6)
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు.https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు
(image source from https://unsplash.com/)(5 / 6)
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులకు కావాల్సిన పత్రాలు : పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, టీసీ(ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్), 01-01-2024 తర్వాత జారీ అయిన ఆదాయపత్రం, EWS రిజర్వేషన్ అర్హత ఉంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉండాలి. కుల ధ్రువీకరణపత్రం తప్పనిసరి.
(image source from https://unsplash.com/)(6 / 6)
తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్) ర్యాంక్ కార్డు కూడా కౌన్సెలింగ్ లో ముఖ్యమైనంది. మీ ర్యాంక్ కార్డును https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
(image source from https://unsplash.com/)ఇతర గ్యాలరీలు