Tirupati : టీటీడీ ప్రకటన... SPMP కాలేజీలో ఫార్మసీ డిప్లొమా స్పాట్ అడ్మిషన్లు
Sri Padmavati Mahila Polytechnic College News : శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది టీటీడీ. స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపింది.
పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా సీట్లు
Sri Padmavati Mahila Polytechnic College Admissions :ఎన్.బి.ఎ గుర్తింపుగల టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా (DPH) కోర్సులో ప్రవేశానికి డిసెంబరు 13వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది.
ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఉతీర్ణత పొందిన ఆసక్తి గల విద్యార్థినులు విద్యార్హత సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు 3 సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 9299008151, 9247575386, 8978993810 నంబర్లను సంప్రదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.