PM Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్-ap government offers free installation to sc sts for pm suryaghar yojana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్

PM Suryaghar: పీఎం సూర్య ఘర్ యోజన అప్టేడ్.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కారు ఉచిత ఇన్‌స్టలేషన్

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 13, 2024 05:00 AM IST

PM Suryaghar: ప్రధాన మంత్రి సూర్యఘర్‌ యోజన పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే క్రమంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాల్లో సౌర విద్యుత్‌ పథకాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ పథకంలో అయా వర్గాలకు ఉచితంగా సోలార్‌ ఇన్‌స్టలేషన్ చేస్తారు.

పీఎం సూర్యఘర్ యోజనలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
పీఎం సూర్యఘర్ యోజనలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

PM Suryaghar yojana: గృహ విద్యుత్‌ వినియోగంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే పిఎం సూర్య ఘర్ యోజన పథకంలో కీలక మార్పులకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 200యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్‌ స్థానంలో సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

yearly horoscope entry point

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టలేషన్‌లను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6.5 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తయ్యాయి. మొత్తం లోడ్ 24,339 కిలోవాట్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలో వాట్ కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు రాయితీ చెల్లించారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు మరియు ఇన్‌స్టలేషన్లు పెరిగేలా చూడాలని ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ సూచించారుే.

ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ కింద 6,77,146 మంది, ఏపీ.సీ.పీ.డీ.సీ.ఎల్ కింద 5,9,587 మంది, ఏపీ.ఎస్పీ.డీ.సీ.ఎల్ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు. వీరితో సోలార్‌ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.

పీఎం కుసుమ్

ఇందులో 3 స్కీమ్స్ ఉన్నాయి. మనం కాంపోనెంట్-సీ కింద మొత్తం 3,725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను సోలారైజ్ చేయడానికి ప్రతిపాదించడం జరిగింది.

• 0.5 నుండి 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన కోసం ఒక మెగావాట్ కు సంబంధించి ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాలను గుర్తించాలి.

డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీలు – ఆర్డీ.ఎస్.ఎస్

• రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా విద్యుత్ కమిటీలను నోటిఫై చేసింది..

• జిల్లాల్లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధిని సమీక్షించడానికి, సమన్వయం చేయడానికి కమిటీలు కనీసం మూడు నెలలకు ఒకసారి జిల్లా కేంద్ర కార్యాలయంలో కాలానుగుణంగా సమావేశమవ్వాలి.

• జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో మినిట్స్ జారీ చేయాలి.

బయో గ్యాస్ (సీ.బీ.జీ) ప్లాంట్స్ - ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024

• ఇందులో రిలయన్స్ సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది.మూలధన సబ్సిడీ.. సీబీజీ ప్లాంట్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌సీఐ)పై 20% కేపిటల్ సబ్సిడీ గరిష్టానికి లోబడి ఉంటుంది.

• విద్యుత్ డ్యూటీ : సీఓడీ నుండి 5 సంవత్సరాల కాలానికి సీబీజీ ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్ కు 100% విద్యుత్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్.

• ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం సీబీజీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు లీజు చొప్పున వ్యర్థ భూములను కేటాయించాలి.

• కలెక్టర్లు మా దగ్గర ఈ భూములున్నాయని ముందుకు వస్తే రైతులతో కలిసి ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.వారికి ఆదాయంలో వాటా కల్పిస్తారు.

న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ (RE) ప్రాజెక్ట్స్

• 1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా దొనకొండలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో, 500 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా ఎన్.పి.కుంటలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో సోలార్ పార్కుల ఏర్పాటు చేస్తారు.

Whats_app_banner