APPGECET 2024: ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల
APPGECET 2024: ఆంధ్రప్రదేశ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ పరీక్షను ఎస్వీ యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
APPGECET 2024: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ PG Engineering కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ Common Entrance పరీక్ష నిర్వహణకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఏపీ పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంటెక్ M tech, ఎం ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు ఓసీ అభ్యర్ధులు రూ.1200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.
పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ Entrance test పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జి ప్యాట్, గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం విడిగా మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 23 నుంచి స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు. మే 29 నుంచి మే 31 వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. రూ.5వేల జరిమానాతో మే 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
సిలబస్...
బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఫుడ్ టెక్నాలజీ,జియో ఇన్ఫర్మటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, నానో టెక్నాలజీ, ఫార్మసీ సబ్జెక్టుల సిలబస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
ముఖ్యమైన తేదీలు...
ఏపీ పీజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ 2024 టెస్ట్ నోటిఫికేషన్ మార్చి 17న విడుదలైంది. మార్చి 23నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా స్వీకరిస్తారు. రూ.500 రుసుముతో ఏప్రిల్ 21 నుంచి 28వ తేదీ వరకు స్వీకరిస్తారు. రూ.2వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు స్వీకరిస్తారు. రూ.5వేల పెనాల్టీతో రూ.మే ఆరు నుంచి 12వరకు స్వీకరిస్తారు.
మే 22వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 29 నుంచి 31వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీను మే 31, జూన్ 1, 2 తేదీల్లో ప్రకటిస్తారు. జూన్ 2,3,4 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ర్యాంకులను జూన్ 8న విడుదల చేస్తారు.
సబ్జెక్టుల వారీగా మాక్ టెస్ట్‌లు ఏపీ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, సిలబస్, మాక్ టెస్ట్‌లతో కూడిన వివరాలు ఈ లింకులో అందుబాటులో ఉంటాయి. https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx
పీజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నాలుగు దశల్లో దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో కోర్సుల వారీగా అర్హతలు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తర్వాత దశలో పరీక్ష ఫీజును చెల్లించాలి. మూడో దశలో దరఖాస్తు ఫారం నింపిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాలుగో దశలో సబ్మిట్ చేసిన దరఖాస్తు ప్రింట్ తీసుకోవాలి.