తెలుగు న్యూస్  /  Videos  /  Today Breakfast Recipe Is Cream Of Almond Soup Here Is The Ingredients And Details

Breakfast Recipes: ప్రోటీన్స్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​

30 July 2022, 7:47 IST

    • Breakfast Recipes : బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. టేస్ట్​కి బాగుంటుంది. హెల్త్​కి చాలా మంచిది. అయితే ఈ బాదంతోనే మన బ్రేక్​ఫాస్ట్ చేసుకుంటే.. ఇంకా హెల్తీగా మన డేని స్టార్ట్ చేసినట్టే. మీరు కూడా మీ బ్రేక్​ఫాస్ట్​లో బాదం యాడ్ చేయాలనుకుంటే.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​ గురించి తెలుసుకోవాల్సిందే.. చేసుకుని తినాల్సిందే.
క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్
క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్

క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్

Breakfast Recipes : ఉదయాన్నే ప్రోటీన్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్ తీసుకుంటే.. మనకి ఎనర్జీబాగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. పైగా అది బాదంతో అయితే ఇంక చెప్పనవసరంలేదు. బాదం హెల్త్​కి చాలా మంచిది. పైగా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా సూప్​ లాగిస్తే.. ఆహా ఆ వెచ్చని ఫీల్​ గురించి మాటల్లో చెప్పలేము. మీరు కూడా ఇలాంటి అనుభూతిని చెందాలి అనుకుంటే.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​ని తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

NTR on Dance Performance: ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్ ప్రదర్శనపై తారక్ క్లారిటీ.. ఏమన్నారంటే?

Body Scrubbing Mistakes । స్నానం చేసేటపుడు శరీరాన్ని రుద్దుతున్నారా? ఆ తప్పు చేయొద్దు!

PM Modi Vizag Tour: విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ భేటీపైనే అందరి చూపు…

రూ. 20,000 కంటే తక్కువ ధరలో లభించే 5G బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..మీరు ఓ లుక్కేయండి!

కావాల్సిన పదార్థాలు

* వెజిటబుల్ స్టాక్ - 800 Ml

* మిల్క్ - 200 ml

* బాదం (పొడి) - 100 gms

* వెన్న - 50 gms

* మొక్కజొన్న పిండి - 50 gms

* ఉప్పు - రుచికి తగినంత

* మిరియాలు - చిటికెడు

* జాజికాయ - కొంచెం

* బాదం ఎసెన్స్ - 2-3 చుక్కలు

* బాదం - 3 ముక్కలు చేసుకోవాలి

క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్ తయారీ విధానం

ఒక పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై ఉంచాలి. ఇప్పుడు ఈ పాన్​లో వెన్న వేసి.. తక్కువ వేడి మీద కరిగించాలి. దానిలో మొక్కజొన్న పిండి, పాలు కలిపిన మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. దానిలో బాదం పొడి, వెజిటబుల్ స్టాక్‌ను వేసి బాగా కలపాలి. దానిలో ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ, బాదం ఎసెన్స్ వేసి బాగా కలపాలి. అంతే క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్ రెడీ. వేడి వేడిగా బాదం ముక్కలతో అలంకరించి దానిని సర్వ్ చేయాలి.

టాపిక్