తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : ఆరోగ్యకరమైన, టేస్టీ మసాలా ఓట్స్.. ఇలా చేసేయండి..

Breakfast Recipes : ఆరోగ్యకరమైన, టేస్టీ మసాలా ఓట్స్.. ఇలా చేసేయండి..

26 July 2022, 9:32 IST

    • Breakfast Recipes : ఆరోగ్యంపై శ్రద్ధ వహించే చాలా మంది ఓట్స్​ను తమ డైట్​లో భాగం చేసుకుంటారు. అయితే ఓట్స్ కాస్త చప్పగా నోటికి అంతగా రుచిలేకుండా ఉంటాయి. కాబట్టి వాటిని టేస్టీగా తినాలి అనుకునేవారికి ఇక్కడో రెసిపీ ఉంది. అదే మసాల ఓట్స్. ఇంట్లోనే తయారు చేసుకునే హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి.. ఆరగించేయండి.
మసాల ఓట్స్
మసాల ఓట్స్

మసాల ఓట్స్

Breakfast Recipes : ఉదయాన్నే సింపుల్​గా, నోటికి రుచిగా ఉండే బ్రేక్​ఫాస్ట్​లను ఇష్టపడనివారు ఎవరుంటారు. పైగా ఆరోగ్యకరమైన టిఫెన్​కు నో కూడా చెప్పలేము. అయితే మీరు అలాంటి టిఫెన్​కోసం ఎదురుచూస్తే మీకు మసాలా ఓట్స్ మంచి ఎంపిక. దానిని ఎలా తయారు చేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా ఓట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

* ఓట్స్ - 1 కప్పు

* ఉల్లిపాయ - 1 చిన్నది (తరగాలి)

* టొమాటో - 1 చిన్నది (తరగాలి)

* క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు ముక్కలు

* పచ్చిమిర్చి - 2

* గరం మసాలా- 1/2 టీస్పూన్

* కారం - 1 టీస్పూన్

* పసుపు పొడి - కొంచెం

* ఉప్పు - రుచికి సరిపడా

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

* నెయ్యి - స్పూన్

* బఠాణీ - 2 స్పూన్స్ (నానబెట్టాలి)

మసాలా ఓట్స్ తయారీ విధానం

ఓట్స్ తీసుకుని.. వాటిని ఫ్రై చేయండి. అవి క్రిస్పీగా మారిన తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడిచేయండి. దానిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి.. వేయించాలి. దాని తర్వాత ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అవి ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి.

అనంతరం గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి మళ్లీ కలపండి. అవసరం మేరకు నీళ్లు పోసి అవి మరిగిన తర్వాత ఓట్స్ వేయాలి. దీనిని 5-6 నిమిషాలు ఉడికించి.. వేడి వేడిగా లాగించేయడమే.

టాపిక్