Breakfast Recipes : మంచి కాఫీలాంటి అనుభూతినిచ్చే కాఫీ కప్ కేక్
23 July 2022, 8:13 IST
- అసలే వీకెండ్. లేట్‌గా లేవాలి అనిపించే వెదర్. ఈ టైమ్‌లో కాఫీ ఉంటే బాగుంటుంది. కానీ కాఫీతో తయారు చేసిన కప్ కేక్ ఉంటే.. అబ్బా ఆ ఫీల్ అద్భుతమనే చెప్పాలి. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కాఫీ ఒకే రెసిపీలో వచ్చేస్తే.. మీ టమ్మీ హ్యాపిగా ఉంటుంది. అయితే ఈ కాఫీ కేక్ చేయడం చాలా సులువు తెలుసా?
కాఫీ కప్ కేక్
మీరు కాఫీ ప్రియులైతే.. ఈ రెసిపీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. కాఫీ తాగకపోయినా ఇది మీకు కచ్చితంగా నచ్చే తీరుతుంది. ఎందుకంటే పిల్లలకైనా.. పెద్దలకైనా.. ఈ కప్ కేక్స్ ఓ ఎమోషన్ అనే చెప్పాలి. అయితే ఈ కాఫీ కప్ కేక్ ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ కేక్ తయారికి కావాల్సిన పదార్థాలు
* గోధుమ పిండి - 3 టేబుల్ స్పూన్లు
* పంచదార - 2 టేబుల్ స్పూన్లు (పొడి అయితే ఇంకా బెటర్)
* బేకింగ్ పౌడర్ - పావు టీస్పూన్
* ఉప్పు - చిటికెడు
* పాలు - అరకప్పు
* కాఫీ - 1 టీస్పూన్
* వెనీలా ఎసెన్స్ - కొంచెెెం
కాఫీకేక్ తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు లేదా చిన్న గిన్నె తీసుకోండి. దీనిలో గోధుమపిండి, షుగర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి. ఉండలు లేదని నిర్థారించుకున్న తర్వాత పాలు వేయండి. పాలు వేసినప్పుడు ఉండలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి.. బాగా కలపండి. ఈ మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోండి. దానిలో కాఫీ పొడి వేసి మళ్లీ బాగా కలపండి. చివరిగా వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు మైక్రోవేవ్‌లో దీనిని ఉంచండి. కేక్ రెడీ అని నిర్ధారించుకున్న తర్వాత బయటకు తీయండి. వేడిగా తిన్నా, చల్లగా తిన్నా ఇదీ మీకు అదిరిపోయే టేస్ట్‌ని ఇస్తుంది. పైగా మీరు కాఫీ లవర్ అయితే.. ఈ టేస్ట్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది.