తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : బెల్లంతో బ్రౌనీ.. వినడానికి వైరటీగా ఉంది కదూ.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది

Breakfast Recipe : బెల్లంతో బ్రౌనీ.. వినడానికి వైరటీగా ఉంది కదూ.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది

21 July 2022, 8:42 IST

    • Brownie Recipe : చాలామందికి ఉదయాన్ని స్వీట్ తినాలనే కోరిక ఉంటుంది. కానీ ఏమి చేసుకోవాలో తెలియదు. పాయసం, సేమ్యా వంటి స్వీట్స్ చేసుకోవచ్చు కానీ.. మనసు కేక్స్, బ్రౌనీలవైపు లాగుతూ ఉంటుంది. అయితే మీరు కూడా స్వీట్ క్రావింగ్​తో ఉంటే.. ఈ బ్రౌనీ మీ బ్రేక్​ఫాస్ట్​కి పర్​ఫెక్ట్. 
బ్రౌనీ
బ్రౌనీ

బ్రౌనీ

Brownie Recipe : చాలామందికి స్వీట్ టూత్ ఉంటుంది. స్వీట్ టూత్​ అంటే.. స్వీట్స్ తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండడం. వారికి పగలు, రాత్రి, ఉదయం అనే తేడా ఉండదు. స్వీట్​ ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తారు. మీరు కూడా ఆ కోవకు చెందిన వారే అయితే ఇక్కడ మీకో రెసిపీ ఉంది. అదే బెల్లం బ్రౌనీ.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

బెల్లం మీ శరీరానికి మంచే చేస్తుంది కాబట్టి.. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీకు నచ్చిన బ్రౌనీతో మీ డేని స్టార్ట్ చేయండి. డే అంతా మధురంగా మారిపోతుంది. అయితే ఈ బ్రౌనీని ఎలా తయారుచేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం బ్రౌనీ తయారీకి కావాల్సిన పదార్థాలు

* వెన్న - 250 గ్రాములు

* వనస్పతి - 250 గ్రాములు

* బెల్లం - 500 గ్రాములు

* గుడ్లు - 2

* డార్క్ చాక్లెట్ - 750 గ్రాములు

* గోధుమ పిండి - 200 గ్రాములు

* కోకో పౌడర్ - 25 గ్రాములు

* వెనిలా ఎసెన్స్ - 10 గ్రాములు

* వాల్ నట్స్ - 10 గ్రాములు (గార్నిష్)

బెల్లం బ్రౌనీ తయారీ విధానం

ఒక గిన్నె తీసుకుని.. దానిలో బటర్, వనస్పతి, బెల్లం, గుడ్లు, డార్క్ చాక్లెట్, గోధుమ పిండి, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ వరుసగా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేవని నిర్థారించుకున్నాక.. దానిని బటర్ రాసిన ట్రేలో పోయాలి.

అనంతరం వాల్​నట్స్​తో గార్నిష్ చేయాలి. 160 డిగ్రీల వద్ద 45-50 నిముషాలు ఓవెన్​లో కాల్చాలి. టూత్​ పిక్​తో దానిలో గుచ్చాలి. పిండి అంటుకోవట్లేదంటే.. బ్రౌనీ సిద్ధం అయిపోయినట్లే. ఇంకేముంది మీ స్వీట్ క్రావింగ్ తీరిపోయినట్లే. ఇంట్లోనే చిన్నగా పార్టీలు చేసుకునేప్పుడు కూడా దీనిని ఈజీగా తయారు చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం