తెలుగు న్యూస్  /  వీడియో  /  Body Scrubbing Mistakes । స్నానం చేసేటపుడు శరీరాన్ని రుద్దుతున్నారా? ఆ తప్పు చేయొద్దు!

Body Scrubbing Mistakes । స్నానం చేసేటపుడు శరీరాన్ని రుద్దుతున్నారా? ఆ తప్పు చేయొద్దు!

HT Telugu Desk HT Telugu

15 November 2022, 23:36 IST

    • Body Scrubbing Mistakes: స్నానం చేసేటపుడు చాలా మంది బ్రష్ లేదా బాత్ స్టోన్ ఉపయోగించి తమ చర్మాన్ని రుద్దుతారు. కానీ దీని వల్ల చర్మం డ్యామేజ్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
Body Scrubbing
Body Scrubbing (Unsplash)

Body Scrubbing

ప్రతిరోజూ స్నానం చేయడం మంచి అలవాటే, కానీ స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకోవడం, ఆపై బాడీ స్క్రబ్బింగ్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు అవసరం. మురికిని తొలగించుకునేందుకు కొందరు బాత్ స్టోన్లతో చర్మాన్ని చాలా గట్టిగా రుద్దుతారు, మరికొందరు చర్మాన్ని రుద్దడానికి బ్రష్‌ని ఉపయోగిస్తారు. కానీ గంటల తరబడి స్నానం చేయడం, చర్మంపై స్క్రబ్బింగ్ తరచుగా చేయడం వల్ల మురికి పోవటం అటుంచితే చర్మ సమస్యలు పెరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు

NTR on Dance Performance: ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్ ప్రదర్శనపై తారక్ క్లారిటీ.. ఏమన్నారంటే?

PM Modi Vizag Tour: విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ భేటీపైనే అందరి చూపు…

Breakfast Recipes: ప్రోటీన్స్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్.. క్రీమ్ ఆఫ్ ఆల్మండ్ సూప్​

రూ. 20,000 కంటే తక్కువ ధరలో లభించే 5G బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..మీరు ఓ లుక్కేయండి!

చర్మాన్ని గట్టిగా స్క్రబ్ చేయడం లేదా తువాలుతో తుడవడం మంచిది కాదు. అలాగే చర్మాన్ని స్క్రబ్ చేయడానికి లూఫాలు, బాత్ స్క్రబ్‌లను ఉపయోగించడం కూడా చర్మానికి కీడు చేస్తుందని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. ఎక్కువగా ఎండలో తిరిగినపుడు చర్మం సూర్యరశ్మి తాకిడికి గురై టాన్ అవుతుంది. ఆ ప్రాంతంలో నల్లగా మారుతుంది. కానీ చర్మంపై ఏర్పడిన టాన్ తొలగించుకోవడానికి స్క్రబ్బింగ్ పరిష్కారం కాదు, అందుకు వేరే మార్గాలు ఉన్నాయి.

Body Scrubbing- Common Mistakes

సాధారణంగా మెడ, మోచేతులు, మోకాళ్లు టానింగ్ కారణంగా నల్లగా మారతాయి. ఈ ప్రాంతంలో తరచుగా స్క్రబ్బింగ్ చేయడం ద్వారా టానింగ్ అనేది తొలగిపోదు, పైగా చర్మం రఫ్ గా మారుతుంది. దద్దుర్లు ఏర్పడతాయి, చర్మం మరింత అసహ్యంగా కనిపిస్తుంది. బదులుగా చర్మం టాన్ అవ్వకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి, బయటకు వెళ్లేటపుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

తరచుగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మ పొర దెబ్బతింటుంది, మృదుత్వం కోల్పోతుంది. చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, చర్మాన్ని దీర్ఘకాలం పాటు స్క్రబింగ్ చేయడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది.ఇది అమిలాయిడ్ అనే ప్రోటీన్ వర్ణద్రవ్యాన్ని క్షీణింపజేయడం ప్రారంభిస్తుంది. ఇది నివారించడానికి, అధిక ఎక్స్‌ఫోలియేషన్, లూఫా, స్క్రబ్బింగ్‌ను నివారించడం ఉత్తమం. అవసరమైతే, వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి స్క్రబ్ చేయండి. అప్పుడు కూడా చాలా సున్నితంగా స్క్రబ్ చేయాలి.

మోచేతులు, పాదాలు, మోకాళ్ల నలుపును తగ్గించడానికి ఒక పరిష్కారం ఉంది. ప్రతి ఉదయం SPF 50 సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. మోచేతులు, మోకాళ్లను తరచుగా మసాజ్ చేయండి. విటమిన్-ఎ, విటమిన్-ఇ పుష్కలంగా ఉన్న పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోండి.

టాపిక్