తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Update Heavy Rain Alert In Hyderabad For Coming Three Days

Hyderabad Weather Update : హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

HT Telugu Desk HT Telugu

14 June 2022, 22:18 IST

    • తెలంగాణ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్రవేశించాయి. ఫ‌లితంగా సోమ‌వారం ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం పడింది. మరో 2, 3 రోజుల్లో హైదరాబాద్ న‌గ‌రంలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైద‌రాబాద్‌లో రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురవనున్నట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆలస్యమైన నైరుతి రుతుప‌వ‌నాలు తాజాగా తెలంగాణ‌లోకి ప్రవేశించిన.. సంగ‌తి తెలిసిందే. ఈ ప్రభావంతో సోమ‌వారం హైదరాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. తాజాగా రానున్న రెండు, మూడు రోజుల్లో న‌గ‌రంలో భారీ వ‌ర్షం కుర‌వ‌నున్నట్టు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TS 10th Results 2024: నేడే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలతో గ్రేట‌ర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమైంది. న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉండాల‌ని జీహెచ్ఎంసీ మంగ‌ళ‌వారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా సూచించింది.

ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

ఇప్పటికీ ఉక్కపోతతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది. అయితే సోమవారం నాడు.. కొన్ని ప్రాంతాల్లో.. చిరుజల్లులు పడటంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. వచ్చే రెండు రోజులు కూడా.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు కదులుతాయని పేర్కొంది.

టాపిక్