తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rains In Hyderabad | భాగ్యనగరంలో ఉదయం నుంచి ఒకటే ఎండ.. సాయంత్రం ఉపశమనమిచ్చిన వరుణుడు

Rains In Hyderabad | భాగ్యనగరంలో ఉదయం నుంచి ఒకటే ఎండ.. సాయంత్రం ఉపశమనమిచ్చిన వరుణుడు

HT Telugu Desk HT Telugu

28 April 2022, 17:20 IST

google News
    • ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ భాగ్యనగర వాసులకు.. కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉదయం నుంచి హైదరాబాద్ లో ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన జనాలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించి వెళ్లాడు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీందో నగరవాసులకు ఉపశమనం లభించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నగరంలోని సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, బోలక్‌పూర్, గాంధీనగర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.

బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, ఏంజె మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆకస్మాత్తుగా వాన రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల​, జగిత్యాల​, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో విపరీతంగా వేడి ఉంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 46 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం