తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Announced Exam Dates For Town Planning Officer And Veterinary Assistant Surgeon Jobs

TSPSC Exams : అలర్ట్... మరో 2 పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

HT Telugu Desk HT Telugu

19 May 2023, 21:11 IST

    • TSPSC Latest Updates: ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరో ఉద్యోగ నియామక పరీక్ష తేదీలను ప్రకటించింది.
టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌పీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ

TSPSC Exam Dates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. ఇప్పటికే 30 మందికిపై గా అరెస్ట్ చేయగా… మరోవైపు ఈడీ కూడా విచారిస్తోంది. ఇదిలా ఉంటే పరీక్ష నిర్వహణ తేదీలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని పరీక్షల తేదీలను వెల్లడించగా… తాజాగా మరో రెండు పరీక్షల తేదీలను ప్రకటించింది. జులై 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష ఉండగా... జులై 13, 14వ తేదీన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్….

TSPSC Group 1: పేపర్‌ లీక్ వ్యవహారంతో రద్దైన గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలను జూన్‌11న తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులు ఉండటంతో ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించనున్నారు.జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు టిఎస్‌పిఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు.మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.

తెలంగాణలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్‌ బెస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సైతం ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.