తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb Skill Test Dates: డ్రైవర్, మెకానిక్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్... స్కిల్ టెస్ట్ తేదీలివే

TSLPRB Skill Test Dates: డ్రైవర్, మెకానిక్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్... స్కిల్ టెస్ట్ తేదీలివే

HT Telugu Desk HT Telugu

23 February 2023, 13:52 IST

    • Skill Test for Driver and Mechanic Constable Jobs:పోలీస్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రిక్రూట్ మెంట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. డ్రైవర్​, మెకానిక్​ కానిస్టేబుల్​ అభ్యర్థులకు స్కిల్​ టెస్ట్ తేదీలను ప్రకటించింది.​
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్

Telangana State Level Police Recruitment Board Updates: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు రాగా.. వెంటనే ఈవెంట్స్ కూడా పూర్తి చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో పలువురి అభ్యర్థులకు కూడా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది.. డ్రైవర్​, మెకానిక్​ కానిస్టేబుల్​ అభ్యర్థులకు స్కిల్​ టెస్ట్ తేదీలను ప్రకటించింది.​ ఈ మేరకు వివరాలను పేర్కొంది.

మార్చి 2 నుంచి పరీక్షలు...

డ్రైవర్​, మెకానిక్​ కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి స్కిల్​ టెస్ట్ నిర్వహించనున్నారు.​ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ స్కిల్​ టెస్ట్​ నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. పోలీస్​ ట్రాన్స్​పోర్టు ఆఫీసర్​, మెకానిక్​, డ్రైవర్లు, విపత్తు నిర్వహణ విభాగంలో అభ్యర్థులకు ఈ స్కిల్ టెస్ట్ పరీక్షలు ఉంటాయి. అంబర్​పేట్​లోని సీఏ ఆర్​ హెడ్​ క్వార్టర్స్​లో మార్చి 2 నుంచి 23 వరకు పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 28 అర్ధరాత్రి వరకు అడ్మిట్​ కార్డులు డౌన్​ లోడ్​ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ముఖ్య సూచనలు...

PMT / PET పూర్తి చేసిన పత్రాలను తీసుకురావాలి.

డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తప్పనిసరి.

మెకానిక్ ఉద్యోగ అభ్యర్థులు ITI సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.

జిరాక్స్ సెట్లు కూడా తీసుకురావాలి.

గ్రౌండ్ లోకి మొబైల్ తీసుకురావటం నిషేదం

అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు బోర్డు అధికారిక వెబ్ సైట్ www.tslprb.in లోకి వెళ్లాలి. తగిన వివరాలను సమర్పించిన తర్వాత... మీకు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి. ఇక ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నవారు... support@tslprb.in కు మెయిల్ లేదా... 93937 11110 or 93910 05006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.