TS High Court Recruitment : పది అర్హతతో హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు.. స్కిల్ టెస్ట్ మాత్రమే -telangana high court issued notification for driver posts recruitment 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court Recruitment : పది అర్హతతో హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు.. స్కిల్ టెస్ట్ మాత్రమే

TS High Court Recruitment : పది అర్హతతో హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు.. స్కిల్ టెస్ట్ మాత్రమే

Mahendra Maheshwaram HT Telugu
Jan 25, 2023 02:27 PM IST

TS High Court Jobs 203: తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

Telangana High Court Driver Posts 2023: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర బోర్డులు, శాఖల నుంచి వరుస ప్రకటనలు వస్తున్నాయి. ఇదే సమయంలో కోర్టుల్లో ఉన్న ఖాళీల భర్తీకి కూడా భారీగా నోటిఫికేషన్లు వచ్చాయి. తాజాగా హైకోర్టులోని పలు ఖాళీల భర్తీకి కూడా ప్రకటనలు రాగా... మరో ఉద్యోగ అప్డేట్ వచ్చింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాలకు జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

ముఖ్య వివరాలు:

పోస్టు పేరు - డ్రైవర్ ఉద్యోగాలు

మొత్తం ఉద్యోగాలు - 12

అర్హత - పది పాస్ అయి ఉండాలి, వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ లో మూడేళ్ల అనుభవం కూడా తప్పనిసరి.

వయస్సు - 18 -34 ఏళ్లు( రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)

ఎంపిక - స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్ -40 మార్కులు), 10 మార్కులు వైవా ఉంటుంది.

దరఖాస్తు రుసుం - 500

దరఖాస్తులు ప్రారంభం - జనవరి 24 , 2023

తుది గడువు - 06 -02- 2023

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

మీరు పూర్తి చేసిన దరఖాస్తును "to the Registrar (Recruitment), High Court for the State of Telangana at Hyderabad 500 066 " అడ్రస్ కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలు ఉన్నాయి.

Jobs in Telangana High Court 2022: డ్రైవర్ పోస్టులే కాకుండా హైకోర్టులోని పలు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 176 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్య వివరాలు:

మొత్తం ఉద్యోగాలు - 176

హైకోర్టు సబార్డినేట్ -50,

సిస్టమ్ అసిస్టెంట్- 45,

కంప్యూటర్ ఆపరేటర్లు – 20

కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు - 20

ఎగ్జామినర్లు - 17,

ట్రాన్స్లేటర్లు – 10

అసిస్టెంట్లు - 10

UD స్టెనోలు - 02

అసిస్టెంట్ లైబ్రేరియన్లు - 02

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేసుకోవాలి

దరఖాస్తు గడువు - జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు

అర్హతలు : 7 వ తరగతి నుండి డిగ్రీ వరకు పోస్ట్ ను అనుసరించి భర్తీ చేస్తారు.

వయోపరిమితి : 18 – 34 సంవత్సరాలు మద్య ఉండాలి . (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు)

ఎంపిక విధానం : రాత పరీక్ష/ కొన్ని పోస్టులకు వైవా నిర్వహిస్తారు.

పరీక్ష తేదీ : మార్చిలో పరీక్షలు ఉంటాయి.

NOTE: https://tshc.gov.in/getRecruitDetails ఈ లింక్ పై క్లిక్ చేసి ఆయా నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

Whats_app_banner