TS Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2054 ఉద్యోగాల భర్తీ….-telangana high court released job notifications for various jobs in district courts including district judges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2054 ఉద్యోగాల భర్తీ….

TS Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2054 ఉద్యోగాల భర్తీ….

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 09:33 AM IST

TS Court Jobs తెలంగాణ న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులతో పాటు స్టెనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జానియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది నియామకాల కోసం వేర్వేరు నోటిఫికేషన్లు జారి చేశారు.

జిల్లా కోర్టుల్లో నియామకాలకు హైకోర్టు నోటిఫికేషన్
జిల్లా కోర్టుల్లో నియామకాలకు హైకోర్టు నోటిఫికేషన్ (tshc)

TS Court Jobs తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో నియామకాలకు హైకోర్టు సిద్ధమవుతోంది. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తులతో పాటు స్టెనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్‌ సిబ్బంది నియామకాల కోసం తెలంగాణ హైకోర్టు 2023 వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ కోర్టుల్లో ఆఫీస్‌ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది నియామకాలకు 8 నోటిఫికేషన్లు జారీ చేసింది.

2022 డిసెంబరు 31 నాటికి తెలంగాణలో జిల్లా జడ్జీలు, సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు సంబంధించి 560 మంజూరైన పోస్టులు మంజూరు అయ్యాయి. వాటిలో 410 మంది పనిచేస్తున్నారు. మరో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా జడ్జీల ఖాళీల్లో 25 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా నియమించనున్నారు. మిగతా వాటిని పదోన్నతులతో భర్తీ చేయనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. 2023 మార్చి 31 నాటికి ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం జూన్‌లో రాత పరీక్ష, సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబరులోనే ప్రకటించనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అక్టోబరు 31 నుంచి కొత్త జడ్జీలు విధుల్లో చేరేలా ప్రణాళికను వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ నియామక క్యాలెండర్‌ను విడుదల చేశారు.

జ్యుడిషియల్‌, మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో....

జిల్లా కోర్టుల్లో ఉన్న 1904 జ్యుడిషియల్‌, మినిస్టీరియల్‌ సబార్డినేట్‌ సర్వీసు పోస్టులను జిల్లా జడ్జీలు భర్తీ చేస్తారని హైకోర్టు ప్రకటించింది. జూనియర్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ప్రాసెస్‌ సర్వర్లు, ఆఫీస్‌ సబార్డినేట్ల పోస్టులకు మార్చిలోగా నియామక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది.

33 జిల్లాల్లోని కోర్టులతోపాటు నగరంలోని సిటీ సివిల్‌ కోర్టు తదితరాల్లో ఉన్న ఖాళీలను విడివిడిగా గుర్తించింది. వీటితోపాటు స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, కాపీయిస్ట్‌ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తెలంగణ జిల్లా కోర్టుల్లో వేర్వేరు ఉద్యోగాలకు సంబంధించిన నోటిపికేషన్లను హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఉద్యోగార్ధులు https://tshc.gov.in/లింకు ద్వారా నోటిఫికేషన్లను చూడవచ్చు.

IPL_Entry_Point