TS High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో 176 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
Telangana High Court Recruitment 2023 :తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు రాగా.. తాజాగా హైకోర్టులో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి.
Telangana High Court Jobs2023 : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు ఇతర శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా... తెలంగాణ హైకోర్టులోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 176 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్య వివరాలు:
మొత్తం ఉద్యోగాలు - 176
హైకోర్టు సబార్డినేట్ -50,
సిస్టమ్ అసిస్టెంట్- 45,
కంప్యూటర్ ఆపరేటర్లు – 20
కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు - 20
ఎగ్జామినర్లు - 17,
ట్రాన్స్లేటర్లు – 10
అసిస్టెంట్లు - 10
UD స్టెనోలు - 02
అసిస్టెంట్ లైబ్రేరియన్లు - 02
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేసుకోవాలి
దరఖాస్తు గడువు - జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు
అర్హతలు : 7 వ తరగతి నుండి డిగ్రీ వరకు పోస్ట్ ను అనుసరించి భర్తీ చేస్తారు.
వయోపరిమితి : 18 – 34 సంవత్సరాలు మద్య ఉండాలి . (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు)
ఎంపిక విధానం : రాత పరీక్ష/ కొన్ని పోస్టులకు వైవా నిర్వహిస్తారు.
పరీక్ష తేదీ : మార్చిలో పరీక్షలు ఉంటాయి.
NOTE: https://tshc.gov.in/getRecruitDetails ఈ లింక్ పై క్లిక్ చేసి ఆయా నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Court Jobs in Telangana 2023 : జిల్లాల్లో ఉన్న పలు న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే 6 ప్రకటనలు జారీ అయ్యాయి. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చిలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను https://tshc.gov.in/getRecruitDetails వెబ్‌సైట్‌లో చూడొచ్చు.