TSPSC Notifications: గుడ్ న్యూస్.. 276 ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్లు-tspsc issued notification for 148 posts of agriculture officers and 128 posts of physical directors jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Notifications: గుడ్ న్యూస్.. 276 ఉద్యోగాల భర్తీకి Tspsc నోటిఫికేషన్లు

TSPSC Notifications: గుడ్ న్యూస్.. 276 ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్లు

Mahendra Maheshwaram HT Telugu
Dec 28, 2022 09:46 PM IST

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు

Agriculture Officers and Physical Directors Jobs in Telangana: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు వచ్చాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులతో పాటు, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు ఇచ్చింది. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ విభాగంలో 148 ఏఓ పోస్టులను, 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది.

విద్యాశాఖలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. జనవరి 6వ తేదీ నుంచి అదే నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించింది.

ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 6 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 27ను తుది గడువుగా నిర్ణయించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌ tspsc.gov.in లో సంప్రదించాలని సూచించింది.

IPL_Entry_Point