Textile Cluster Development Jobs : చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు….-applications invited for jobs in handlooms and textile cluster development jobs in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Textile Cluster Development Jobs : చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు….

Textile Cluster Development Jobs : చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు….

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 09:59 AM IST

Textile Cluster Development Jobs ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలోని టెక్స్‌ టైల్ డిజైనర్‌, క్లస్టర్ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 31లోగా అభ్యర్థులు దరఖాస్తుల్ని చేనేత జౌళి శాఖ కమిషనర్‌కు పంపాల్సి ఉంటుంది.

చేనేత జౌళి శాఖలో ఉద్యోగాలు
చేనేత జౌళి శాఖలో ఉద్యోగాలు (Hindustan times)

Textile Cluster Development Jobs ఏపీలో టెక్స్‌టైల్ డిజైనర్ ఉద్యోగాలతో పాటు క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో టెక్స్‌ టైల్ డిజైనర్ ఉద్యోగాల్లో 7 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్‌లలో 7 ఖాళీలులో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.

నంధ్యాల జిల్లా బనగాన పల్లె , తూర్పుగోదావరి జిల్లా మురమండ, పూలగుర్త , పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, నారాయణపురం, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, అనకాపల్లిలోని పాయకరావుపేట లలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చేనేత శాఖ కమిషనర్‌ తెలిపారు.

క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నకు హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లొమాతో పాటు రెండే‌ళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, రికార్డుల నిర్వహణ లో అనుభవం ఉండాలి.

టెక్స్‌టైల్ డిజైనర్ పోస్ట్‌నకు టెక్స్ టైల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నుండి ఉత్తీర్ణులు కావడంతో పాటు 2 సంవత్సరాల అనుభవం, చేనేత రంగంలో డిజైన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో అనుభవం కలిగి ఉండాలి. ఏదైనా కంపెనీ లేదా ఏజెన్సీకు డిజైనర్‌ను సిఫార్స్ చేస్తున్నట్లయితే డిజైనర్ బయో డేటా తో పాటు కంపెనీ/ఏజెన్సీ వివరాలు సమర్పించాల్సిఉంటుంది.

నియామకాలు అర్హత, అనుభవం, వయస్సు, నివాసం ఆధారంగా జరుగుతాయి. దరఖాస్తుదారుడు ధ్రువపత్రాల కాపీలతో పాటు బయో డేటాను సమర్పించాలి. క్లస్టర్ మార్గదర్శకాలు http://www.aphandtex.gov.in website నుండి పొందవచ్చు. నియామకాలను తాత్కాలిక ప్రాతిపదికన ఉండి 3 సంవత్సరాల వరకూ నెలకు 30 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తారు.

ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోగా కమిషనేర్, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, IHC కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్ 522523 నకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Whats_app_banner