Telangana News Live December 4, 2024: CM Revanth Reddy : కేసీఆర్... ఎకరంలో రూ. కోటి పంట సంపాదన ఎలానో చెప్పాలి- సీఎం రేవంత్ రెడ్డి
04 December 2024, 23:14 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
CM Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పిడన తర్వాత ఏడాదిలో 55,413 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు.
BRS Mla Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. తన ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపిస్తూ...నీ సంగతి చూస్తానంటూ సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి చూస్తానంటూ హెచ్చరించారు.
ACB Raids : నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు చేసింది. రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా మార్కెట్ కమిటీ వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
- తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం అందటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏజెన్సీ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. నిందితులను కటకటాల్లోకి పంపుతున్నారు.
- హైదరాబాద్ లో మాజీ సీఎం రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పలు సందర్భాల్లో రోశయ్య తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.
- తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. ఈ డిసెంబర్ 9వ తేదీ నాటికి 365 రోజులు పూర్తి అవుతుంది. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… కొన్నింటిని పట్టాలెక్కించింది. ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలెంటో ఓ లుక్కేద్దాం…
- Siricilla Police: రణ గొణ ధ్వనులతో జనాన్ని ఇబ్బంది పెట్టి బైక్ లపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీస్ సైరన్ తో పాటు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే 72 బైక్ లను పట్టుకొని సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్ తో తొక్కించి ద్వంసం చేశారు.
- Earthquake in Telugu States : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ములుగు జిల్లా మేడారం సమీపం కేంద్రంగా భూకంపం నమోదైంది.
- Warangal Eiffel Tower: చారిత్రక కట్టడాలకు నిలయమైన ఓరుగల్లులో ఫారెన్ అందాలు కనువిందు చేస్తున్నాయి. వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్ లాంటి హిస్టారికల్ ప్లేసులున్న సిటీలో విదేశాల్లో పేరుగాంచిన టూరిస్ట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తున్నారు.
- Kazipet Attack: వరంగల్ నగరంలో మరో దారుణం జరిగింది. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వెలిగేటి రాజామోహన్ హత్య జరిగిన రోజే.. మరో వృద్ధుడిపై హత్యా ప్రయత్నం జరిగింది. దాదాపు 70 ఏళ్లున్న వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేయగా.. అడ్డుకోబోయిన అతడి కొడుకుపై కూడా దాడి చేశాడు.