తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Tirupati Secunderabad Srikakulam

SCR Special Trains : గుడ్ న్యూస్…తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు - రూట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

17 November 2022, 6:40 IST

    • south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
సికింద్రాబాద్, తిరుపతి, శ్రీకాకుళానికి స్పెషల్ ట్రైన్స్
సికింద్రాబాద్, తిరుపతి, శ్రీకాకుళానికి స్పెషల్ ట్రైన్స్

సికింద్రాబాద్, తిరుపతి, శ్రీకాకుళానికి స్పెషల్ ట్రైన్స్

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, సికింద్రాబాద్, శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

ACB Arrested Sub Registrar : భూమి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల లంచం, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

TS Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

secunderabad tirupati special trains: సికింద్రాబాద్- తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ రాత్రి 08.05 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుతుంది.

ఈ ట్రైన్ జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబుబాద్, డోర్నకల్, ఖమ్మం, మంథిని, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

tirupati -srikakulam special trains: తిరుపతి - శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 08.10 నిమిషాలకు ప్రత్యేక రైలు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం నుంచి నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రైలు బయల్దేరి... మరునాడు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు.... రేణిగుంట, గుూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

tirupati - secunderabad special trains: ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కూడా ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు. ఈ రైలు నవంబర్ 22వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 08.05 నిమిషాలకు బయల్దేరుతుంది. ఇది మరునాడు ఉదయం 9.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, మథిర, ఖమ్మం, మహబూబూబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైలు ప్రకటించింది. ఈ సేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.