SCR Special Trains : దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు-south central railway run 20 special trains from november 8 to november 25 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 10:09 AM IST

South Central Railway : రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) నవంబర్ 8 నుండి 25 వరకు వివిధ గమ్యస్థానాల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 20 స్పెషల్ రైళ్లను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ - యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూర్ - హైదరాబాద్, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూర్ - సికింద్రాబాద్ ఉన్నాయి. అదేవిధంగా, నాందేడ్ - పానిపట్, పానిపట్ - నాందేడ్, కాచిగూడ - తిరుపతి , తిరుపతి - కాచిగూడ మరియు తిరుపతి-నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అన్నింటిలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Nanded - Panipat Special Trains : నాందేడ్- పానిపట్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నవంబర్, 15, 22వ తేదీల్లో నాందేడ్ నుంచి ఉదయం 8 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 5 గంటలకు పానిపట్ కు చేరుతుంది.

మరోవైపు పానిపట్ నుంచి నాందేడ్ కూడా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ నవంబర్ 16,23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరితే... రెండోరోజు తెల్లవారుజామున 04.15 నిమిషాలకు నాందేడ్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు...పూర్ణ, పర్బాణీ, సేలూ, జల్నా, ఔరంగబాద్, కన్వాడా, రాణికమల్ పాటీ, లక్ష్మీబాయి, గ్వాలియల్, అగ్నా, మథురా, న్యూఢిల్లీ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులను అధికారులు కోరారు.

రైలు నెంబర్ 07431 నవంబర్ 12, 19, 26 తేదీల్లో నాందేడ్‌లో మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు దువ్వాడ(Duvvada) చేరుకుంటుంది. దువ్వాడలో ఉదయం 9.27 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు బరంపూర్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07432 నవంబర్ 13, 20, 27 తేదీల్లో ఉన్నాయి. బరంపూర్(berhampur) నుండి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.35 గంటలకు దువ్వాడ చేరుకుంటాయి. దువ్వాడలో రాత్రి 9.37 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు నాందేడ్ చేరుకుంటాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం