Special Trains: కాకినాడ, సికింద్రాబాద్, తిరుపతికి ప్రత్యేక రైళ్లు - రూట్స్ ఇవే-south central railway special trains between kakinada tirupati secunderabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  South Central Railway Special Trains Between Kakinada Tirupati Secunderabad

Special Trains: కాకినాడ, సికింద్రాబాద్, తిరుపతికి ప్రత్యేక రైళ్లు - రూట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Nov 05, 2022 07:26 PM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

దక్షిణ మధ్య. రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య. రైల్వే ప్రత్యేక రైళ్లు (HT)

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాకినాడ, తిరుపతి, సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. టైమింగ్స్, తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు చూస్తే……

ట్రెండింగ్ వార్తలు

kakinada - tirupati special trains : కాకినాడ టౌన్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. నవంబర్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ నుంచి రైలు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు తిరుపతికి చేరుతుంది.

ఈ ప్రత్యేక రైలు... సామల్ కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - tirupati special trains: తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు అధికారులు. ఈ రైలు నవంబర్ 7వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 08.15 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు అంటే 8వ తేదీన ఉదయం 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుతుంది.

ఈ స్పెషల్ ట్రైన్.... రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడ, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

ఈ రూట్ లోనూ స్పెషల్ ట్రైన్స్…

Nanded - Panipat Special Trains : నాందేడ్- పానిపట్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నవంబర్, 15, 22వ తేదీల్లో నాందేడ్ నుంచి ఉదయం 8 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 5 గంటలకు పానిపట్ కు చేరుతుంది.

మరోవైపు పానిపట్ నుంచి నాందేడ్ కూడా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ నవంబర్ 16,23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఆయా తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరితే... రెండోరోజు తెల్లవారుజామున 04.15 నిమిషాలకు నాందేడ్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు...పూర్ణ, పర్బాణీ, సేలూ, జల్నా, ఔరంగబాద్, కన్వాడా, రాణికమల్ పాటీ, లక్ష్మీబాయి, గ్వాలియల్, అగ్నా, మథురా, న్యూఢిల్లీ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులను అధికారులు కోరారు.

IPL_Entry_Point