తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tirupati Special Trains: తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. వయా నల్గొండ - వివరాలివే

Tirupati Special Trains: తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. వయా నల్గొండ - వివరాలివే

HT Telugu Desk HT Telugu

25 January 2023, 17:19 IST

    • South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు ఆయా తేదీలతో పాటు టైం  వివరాలను పేర్కొంది.
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతికి ప్రత్యేక రైళ్లు

తిరుపతికి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వెల్లడించిన వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Secunderabad Tirupati Trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైలును నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు జనవరి 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 07.05 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.50 గంటలకు తిరుపతి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు కూడా స్పెషల్ ట్రైన్ ఉంది. జనవరి 28వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 08.25 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరుతో పాటు రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ 1 క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ తో పాటు స స్లీపర్, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు…

ఇక హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. నిర్వహణ కారణాలతో ఇవాళ అంటే జనవరి 25న భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే 47135, 47137 నంబర్ గల రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్, లింగంపల్లి మధ్య నడిచే 47111, 47110, 47119 నంబర్ గల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక లింగంపల్లి, ఫలక్ నూమా మధ్య నడిచే 47181, 47186, 47181, 47183, 47185, 47117 నంబర్ గల రైళ్లు రదయ్యాయి. ఫలక్ నూమా, లింగంపల్లి మధ్య 47160, 47216, 47161, 47158 నంబర్ గల గల ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 47110, 47119 గల రైళ్లను రద్దు అయ్యాయి. ఫలక్ నూమా-రామచంద్రాపురం మధ్య నడిచే 47218 నంబర్ గల ఎంఎంటీఎస్ రైలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.