Telugu News / Telangana /
ప్రతీకాత్మక చిత్రం
MMTS : హైటెక్ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి
హైదరాబాద్లో దారుణం జరిగింది. హైటెక్ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టి ముగ్గురు చనిపోయారు.
రైలు పట్టాలు దాటేప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొంతమంది నిర్లక్ష్యంతో వ్యవహిరించి చివరకు ప్రాణాలు పొగొట్టుకుంటారు. తాజాగా హైదరాబాద్ లోని.. హైటెక్ సిటీ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును వెళ్తోంది. ఇది గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు ముగ్గురు. రైలు ఢీకొనడంతో రాజప్ప, శ్రీను, కృష్ణ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరి దగ్గర మద్యం సీసాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.