Telugu News  /  Telangana  /  Scr Announced 22 Special Trains Between Kacheguda Tirupati And Nanded To Mumbai
ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

SCR Special Trains: అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు - వెళ్లే రూట్స్ ఇవే

22 January 2023, 6:53 ISTHT Telugu Desk
22 January 2023, 6:53 IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా కాచిగూడ, తిరుపతి, నాందేడ్, ముంబై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వెల్లడించిన వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు ఆదివారం కాచిగూడ నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 09.30 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి ఈనెల 23వ తేదీన సాయంత్రం 04.35 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 6 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక నాందేడ్ - ముంబై మధ్య ప్రత్యేక రైళ్ల నడవనున్నాయి. జనవరి 30, ఫిబ్రవరి 6,13,20తో పాటు 27 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి. ఆయా తేదీల్లో నాదండే నుంచి రాత్రి 09.15 గంటలకు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబై చేరుతుంది. ఇక ముంబై నుంచి జనవరి 31, ఫిబ్రవరి 7,17,27,28 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. ఆయా తేదీల్లో ప్రత్యేక రైలు... ముంబై నుంచి సాయంత్రం 04.40 గంటలకు బయల్జేరి... మరునాడు రాత్రి 09.30 నిమిషాలకు నాందేడ్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... పూర్ణ, బస్మత్, వాసీం, అకోలా, మల్కపూర్, బుస్వాల్, మన్మద్, నాసిక్ రోడ్, ఇగత్ పూర్, కల్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్ కోచ్ లతకో పాటు సూపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులను వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.