తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou Phd Entrance: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

OU Phd Entrance: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu

03 October 2022, 14:12 IST

    • PhD Entrance Test Applications 2022: ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2022 గడువును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఓయూ పీహెచ్డీ ప్రవేశ ప్రకటన,
ఓయూ పీహెచ్డీ ప్రవేశ ప్రకటన, (twitter)

ఓయూ పీహెచ్డీ ప్రవేశ ప్రకటన,

osmania university phd admission 2022-23: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తు గడువు పొడిగించారు. శనివారంతో ముగియనున్న దరఖాస్తు గడువును అక్టోబర్ పదో తేదీ వరకు పొడిగిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఆలస్యం ఫీజు వెయ్యి రూపాయలను చెల్లించి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వర్శిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

OU Phd Entrance : ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. పిహెచ్‌ ఎంట్రన్స్‌ టెస్‌ 2022 ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. ఆర్ట్స్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మాటిక్స్‌, లా, ఒరియంటల్ లాంగ్వేజెస్‌, సోషల్ సైన్సెస్‌, టెక్నాలజీ విభాగాల్లోని పలు కోర్సుల్లో పిహెచ్‌డి కోర్సులకు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లను కల్పిస్తారు.

పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, వికలాంగులకు 50శాతం, మిగిలిన వారికి కనీసం 55శాతం మార్కులు వచ్చి ఉండాలని సూచించారు. జాతీయ స్థాయిలో జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ, సిఎస్‌ఐఆర్‌, ఐసిఎంఆర్‌, డిబిటి, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారికి ఎంట్రన్స్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిహెచ్‌డి అడ్మిషన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష ద్వారా జరుపుతారు. ఎంట్రన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.1500చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, వికలాంగులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌ పరీక్షకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో యూనివర్శిటీ వెబ్‌సైట్‌ www.ouadmissions.com ద్వారా చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను యూనివర్శిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.