తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr New Party: దసరా రోజు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన….?

KCR New Party: దసరా రోజు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన….?

HT Telugu Desk HT Telugu

28 September 2022, 16:26 IST

  •  KCR National Party: విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారనే చర్చ జోరందుకుంది. ఇందుకోసం ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

kcr national politics: కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చ ఊపందకుంది. దసరా దగ్గరపడుతున్న వేళ...కొత్త పార్టీ ప్రకటనపై వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక వర్గాల నేతలు, మేథావులతో చర్చలు కూడా జరిపారు. దేశవ్యాప్త పర్యటనకు కూడా వెళ్లారు. అయితే పార్టీ ప్రకటనపై కొద్దిరోజులుగా వెనక్కి తగ్గరానే వార్తలు వచ్చాయి. తాజాగా ప్రతిపక్షాలు హర్యానాలో తలపెట్టిన ర్యాలీకి కూడా వెళ్లలేదు. దీంతో ఇప్పట్లో జాతీయ పార్టీ ఉండకపోవచ్చనే చర్చ నడిచింది. అయితే అనూహ్యంగా దసరా రోజు పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు బయటికి వస్తున్నాయి.

kcr new party: ఇందుకోసం దసరా రోజున ఆయన ముహూర్తాన్ని కూడా ఎంపిక చేసుకున్నారని సమాచారం. దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు ఆయన టీఆర్ఎస్ఎల్పీ(TRSLP) సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ పేరును ప్రకటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు.

వాస్తవానికి జాతీయ పార్టీ ఏర్పాటు అంశానికి సంబంధించి కేసీఆర్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని, మునుగోడు బైపోల్ తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో దసరా రోజు నిజంగానే ప్రకటన ఉంటుందా...? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

టాపిక్