తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Latest Kerala Tour Package From Hyderabad

IRCTC Kerala Tour : హాట్ సమ్మర్ లో 'కేరళ' ట్రిప్.. తక్కువ ధరలోనే 6 రోజుల టూర్ ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu

17 May 2023, 9:55 IST

    •  IRCTC Latest Kerala Tour Package: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం మరో ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. టూర్ వివరాలు ఇక్కడ చూడండి….
హైదరాబాద్ - కేరళ టూర్
హైదరాబాద్ - కేరళ టూర్

హైదరాబాద్ - కేరళ టూర్

IRCTC Hyderabad - Kerala Tour:: సమ్మర్ వచ్చేసింది...! ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ సమ్మర్ లో కూల్ గా ఉండే ప్రాంతాలకు వెళ్లి సేద తీరాలను చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. కేరళ ట్రిప్ ప్లాన్ చేసే వారికోసం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మే 23, 2023 తేదీన అందుబాటులో ఉంది.ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

Day 01: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.

Day 03 : ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 : హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

Day 05 : హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 06 : మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

కేరళ ట్రిప్ ధరలు

ఈ కేరళ ట్రిప్ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 32,230 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,740 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,130 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

కేరళ టూర్ ధరలు