తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc South India Tour : హైదరాబాద్ టూ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్'

IRCTC South India Tour : హైదరాబాద్ టూ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్'

Anand Sai HT Telugu

05 September 2022, 14:27 IST

google News
    • IRCTC South India Temple Run Tour Package : సౌత్ ఇండియాలో ఆలయాలు సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు చూసేందుకు వీలు కల్పించింది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టూరిస్టు ప్రదేశాలు తిరగాలనుకునేవారికి.. ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలు ప్రకటిస్తోంది. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు అందుబాటు ధరలో ప్యాకేజీలు అందిస్తూ.. టూరిస్టులను తీసుకెళ్తోంది. తాజాగా దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. అదే సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్ ప్యాకేజీ. కుటుంబంతోపాటుగా వెళ్లి.. అన్ని ముఖ్యమైన ఆలయాలు సందర్శించాలనుకునేవారికి ఈ ప్యాకేజీ చాలా బాగుంటుంది.

సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీలో పలు ప్రముఖ ఆలయాలను సందర్శించొచ్చు. ఇందులో కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చి, త్రివేండ్రం లాంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు. టూరిస్టులు ప్రముఖ ఆలయాలైన శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, రామేశ్వరం ఆలయం, మీనాక్షి ఆలయం, శ్రీరంగం ఆలయం, బృహదీశ్వర ఆలయాలను సందర్శించొచ్చు. 6 రాత్రులు, 7 రోజులు టూర్ ప్యాకేజీ ఇది. 2022 నవంబర్ 1న ప్రారంభం అవుతుంది. ఫ్లైట్ టికెట్స్, హోటల్ లో బస, బస్ ఛార్జీలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

Day 1 : హైదరాబాద్ నుంచి ఉదయం 10:15 గంటలకు బయలుదేరుతారు. మధ్యాహ్నాం 12:05 గంటలకు త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. భోజనం అక్కడే చేస్తారు. అనంతరం నేపియర్ మ్యూజియం సందర్శన, సాయంత్రం పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. త్రివేండ్రంలోనే బస ఉంటుంది.

Day 2 : ఉదయం టిఫిన్ చేసి.. చెక్ అవుట్ చేయాలి. కన్యాకుమారికి బయలుదేరుతారు. మార్గంలో పద్మంభపురం ప్యాలెస్‌ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం (మీ స్వంతంగా) చేయాలి. కన్యాకుమారి చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. సన్‌సెట్ పాయింట్‌ సందర్శన ఉంటుంది. కన్యాకుమారిలో డిన్నర్ మరియు రాత్రి బస చేస్తారు.

Day 3 : అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. రాక్ మెమోరియల్ సందర్శిస్తారు. అనంతరం రామేశ్వరం బయలుదేరుతారు. మధ్యాహ్న భోజనం (మీ స్వంతంగా) చేయాల్సి ఉంటుంది. సాయంత్రానికి రామేశ్వరం వెళ్తారు. హోటల్‌లో చెక్ అయి.. డిన్నర్, రాత్రిపూట రామేశ్వరంలో బస చేస్తారు.

Day 4 : రామనాథస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. పర్యాటకులు ఆలయం, చుట్టుపక్కల ప్రాంతాలను స్వయంగా ఆటో రిక్షాల ద్వారా సందర్శించాలి. మధ్యాహ్నం హోటల్‌లో భోజనం. సాయంత్రం ధనుష్కోటి సందర్శనకు వెళ్లాలి. డిన్నర్ చేసి రాత్రిపూట రామేశ్వరంలోనే బస చేస్తారు.

Day 5 : అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ కావాలి. కలాం మెమోరియల్‌ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తంజావూరుకు బయలుదేరాలి. మధ్యాహ్న భోజనం (మీ స్వంతంగా) చేయాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత తిరుచ్చికి బయలుదేరాలి. హోటల్‌లో చెక్ ఇన్ అయి.. డిన్నర్, రాత్రిపూట తిరుచ్చిలో బస చేస్తారు.

Day 6 : ఉదయాన్నే శ్రీరంగం ఆలయానికి తీసుకెళ్తారు. అల్పాహారం చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ అవ్వాలి. ఆ తర్వాత మదురైకి బయలుదేరుతారు. మధ్యాహ్న భోజనం (మీ స్వంతంగా) చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికి మదురై చేరుకుంటారు. తిరుమలనాయక్ ప్యాలెస్ సందర్శించాలి. మధురైలోనే హోటల్‌లో డిన్నర్, రాత్రిపూట బస చేస్తారు.

Day 7 : ఉదయాన్నే మీనాక్షి ఆలయాన్ని సందర్శించాలి. అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. మధ్యాహ్నానికి మదురై విమానాశ్రయంలో ఉంటారు. మధ్యాహ్న భోజనం చేసి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 04:50 గంటలకు చేరుకుంటారు.

ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.30200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.31850, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.42000 ధరగా నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

తదుపరి వ్యాసం