Ganesh immersion 2022 hyderabad: హైదరాబాద్‌లో 9న గణేష్ నిమజ్జనం-ganesh immersion 2022 hyderabad date announced by bhagyanagar ganesh utsava samithi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ganesh Immersion 2022 Hyderabad Date Announced By Bhagyanagar Ganesh Utsava Samithi

Ganesh immersion 2022 hyderabad: హైదరాబాద్‌లో 9న గణేష్ నిమజ్జనం

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 12:55 PM IST

Ganesh immersion 2022 hyderabad date: ఈనెల 9న హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.

హుస్సేన్‌సాగర్‌లో గణనాథుడిని నిమజ్జనం చేస్తున్న భక్తుడు
హుస్సేన్‌సాగర్‌లో గణనాథుడిని నిమజ్జనం చేస్తున్న భక్తుడు (AP)

9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించినట్టు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్ రావు తెలిపారు. అనంత చతుర్దశి కాబట్టి శుక్రవారమే నిమజ్జనం చేయాలని వివరించారు. ‘కొంతమంది పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది వాటిని వాట్సాప్‌‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. అవి నమ్మొద్దు..’ అని కోరారు.

‘కోర్ట్ ఉత్తర్వులు ఉన్నాయి.. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గత ఏడాది మాదిరిగా నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పింది.. పాండ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది.. కానీ అవి ఎన్ని చేశారో తెలియడంలేదు. భక్తులను పాండ్స్ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు.. గణేష్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారు. అటువంటి అపశృతి లేకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలి. కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ సమితికి కూడా అదేవిధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలు మానుకోవాలి. ఇతర పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాల‌పై లేదు. 2001లో ఇచ్చిన జడ్జిమెంట్‌లో కూడా వినాయక సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని చెప్పలేదు. 24 గంటల్లోనే నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగిస్తున్నాం..’ అని వివరించారు.

‘నిమజ్జనంతో ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తమిళనాడు జల్లికట్టు అంశం కోర్ట్‌లో ఉన్నప్పటికీ.. ఏవిధంగా చర్యలు తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిమజ్జనాలకు అదేవిధమైన చర్యలు తీసుకోవాలి..’ అని కోరారు.

‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. గణేష్ ఉత్సవాలకు ముందే చర్యలు తీసుకోవాలి. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేయాలని రేపు ట్యాంక్ బండ్‌పై బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే.. ఎక్కడి విగ్రహాలు అక్కడ పెట్టి నిరసన చేస్తాం..’ అని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point

టాపిక్