IRCTC Tourism: టూరిస్టులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ -irctc tourism announced south india tour from visakhapatnam full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tourism: టూరిస్టులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ

IRCTC Tourism: టూరిస్టులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ

HT Telugu Desk HT Telugu
Jun 23, 2022 10:32 AM IST

విశాఖ నుంచి దక్షిణ భారత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఇందులో ప్రముఖ ఆలయాలు, టూరిజం స్పాట్ లను చూపించనుంది.

<p>ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖ సౌత్ ఇండియా టూర్,</p>
ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖ సౌత్ ఇండియా టూర్, (irctctourism.com)

irctc southern divine temple tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా విశాఖ నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'సదరన్ డివైన్ టెంపుల్ టూర్'(irctc southern divine temple tour) పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రంతో పాటు మరికొన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి.

వివరాలు ఇలా...

ఈ టూర్ ఆగస్ట్ 12న టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చూపించనున్నారు. మొదటిరోజు విశాఖపట్నం నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. ఉదయం 8.55 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 10.20 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2.05 గంటలకు మదురై చేరుకుంటారు. సాయంత్రం మదురైలో మీనాక్షి దేవి ఆలయ సందర్శన ఉంటుంది. సమీపంలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. రాత్రికి మదురైలో బస చేయాలి. రెండో రోజు ఉదయం రామేశ్వరం బయల్దేరుతారు. ఆ తర్వాత ధనుష్కోడి సందర్శన అనంతరం.... రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. మూడో రోజు రామేశ్వరం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. నాలుగో రోజు సన్‌రైజ్ పాయింట్‌లో సూర్యోదయం వీక్షణ ఉంటుంది. అక్కడ్నుంచి కన్యాకుమారి సైట్ సీయింగ్ ఉంటుంది. సాయంత్రం త్రివేండ్రం బయల్దేరాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేస్తారు. ఆరో రోజు ఉదయం 7.25 గంటలకు త్రివేండ్రంలో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.45 గంటలకు చెన్నై చేరుకుంటారు. చెన్నైలో ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధర ఎంతంటే....

ఈ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,770, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.43,330 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>టూర్ ప్యాకేజీ ధరల వివరాలు</p>
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు (irctc tourism)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

8287932318 , 8287932225, 8287932227 ఫోన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

Whats_app_banner