South Central Railway : సికింద్రాబాద్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లు-south central railway run special train between secunderabad to madurai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : సికింద్రాబాద్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లు

South Central Railway : సికింద్రాబాద్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 03:54 PM IST

అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే(SCR) ప్రత్యేక రైళ్లను ఇప్పటికే నడుపుతుంది. తాజాగా సికింద్రాబాద్- మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడవనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్-మధురై (07191) రైలు.. సికింద్రాబాద్‌లో రాత్రి 9.25 గంటలకు బయలుదేరి రాత్రి 8.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 1,8,15, 22 తేదీల్లో ఉంటుంది. మదురై-సికింద్రాబాద్ (07192) మదురై నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 10,17, 24 తేదీల్లో సేవలు అందిస్తుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, తిరువణ్ణామలై, విల్లుపురంలో ఆగుతాయి.

విశాఖ టూ బెంగళూరు ప్రత్యేక రైళ్లు

విశాఖ-బెంగుళూరు మార్గంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రైన్‌ నంబర్‌ 08543 విశాఖపట్నం -ఎస్‌ఎంవిటి బెంగళూరుల మధ్య ఆగష్టు 7,14,21,28, సెప్టెంబర్‌ 4,11,18,25 తేదీలలో మధ్యాహ్నం 3.55కు రైలు బయలుదేరి మర్నాడు ఉదయం 9గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

తిరుగుప్రయాణంలో ట్రైన్‌ నంబర్‌ 08544 రైలు బెంగళూరు-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. బెంగళూరులో మధ్యాహ్నం 3.50కు బయలుదేరే ఈ రైలు మర్నాడు ఉదయం 11గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఆగష్టు 8,15,22,29,5,12,19,26 తేదీలలో బెంగళూరు నుంచి బయలుదేరుతుంది.

విశాఖ-బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలారిపేట్, బంగారుపేట్‌, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-బెంగుళూరు ప్రత్యేక రైలులో సెకండ్ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, సెకండ్ సీటింగ్ బోగీలు ఉంటాయి.

విశాఖపట్నం బెంగుళూరు మధ్య ఆగష్టు -సెప్టెంబర్‌ మధ్యకాలంలో దాదాపు 16 రైళ్లను నడుపనున్నారు. వేసవిలో ప్రారంభించిన ప్రత్యేక రైళ్లను సైతం రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దశల వారీగా కొనసాగిస్తోంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రెగ్యులర్ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోయాయి. దశలవారీగా రైళ్లను పునరుద్ధరిస్తున్న కేంద్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను నడుపుతోంది. సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు కూడా పూర్తి స్థాయి సామర్ధ్యంతో నడుపుతున్నారు. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలతో ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.

IPL_Entry_Point