Hyderabad Traffic : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9 వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు-traffic diversions in hyderabad till september 9th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Traffic Diversions In Hyderabad Till September 9th

Hyderabad Traffic : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9 వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

HT Telugu Desk HT Telugu
Aug 31, 2022 11:04 PM IST

Traffic Diversions In Hyderabad : భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు మెుదలయ్యాయి. ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరాడు. ఇప్పటికే భక్తులు బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు కొన్నిప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ మళ్లింపు

ఆగస్ట్ 31న వినాయక చవితి ఉత్సవాలు మెుదల్యాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. సందర్శకుల సంఖ్యను బట్టి ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే ట్రాఫిక్ నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. రాజ్‌దూత్ లేన్ నుండి బడా గణేష్ వైపు వచ్చే ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ థియేటర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ నుండి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ జంక్షన్ వైపు పంపిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ట్రాఫిక్ రద్దీని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మార్గాల వైపు వెళ్లొద్దని ప్రజలను ఖైరతాబాద్, షాదన్ కళాశాల, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్ మరియు నెక్లెస్ రోటరీ వైపు వెళ్లకుండా ప్రయాణికులు చూసుకోవాలని చెప్పారు.

నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ గార్డెన్‌ మీదుగా గణేష్‌ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చేవారు తమ వాహనాలను ఐమాక్స్‌ థియేటర్‌ పక్కనే కార్‌ పార్కింగ్‌ స్థలంలో చేసుకోవచ్చు. లేదంటే.. ఎన్టీఆర్‌ ఘాట్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పార్కింగ్‌ స్థలాల్లో లేదా పాఠశాల ఆవరణలోని ఐమాక్స్‌ ఎదురుగా పార్కింగ్‌ చేయాలని సూచించారు. సొంత వాహనాల్లో వెళ్లే సందర్శకులు నెక్లెస్ రోటరీ మీదుగా వచ్చి ఖైరతాబాద్ జంక్షన్ రోడ్డు, రాజ్‌దూత్ లేన్‌లకు దూరంగా ఉండాలని చెప్పారు. పౌరులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం